Mumbai : ట్రాఫిక్ జామ్‌లో ఓ ఆటోడ్రైవర్ చేసిన పనికి ఇంటర్నెట్ ఫిదా
ముంబయి లాంటి మహానగరాల్లో ట్రాఫిక్ జామ్‌లు కామనే. గమ్యస్ధానానికి చేరాలన్న తొందరలో మనలో ఉండే చికాకు పోవాలంటే ఏం చేయాలి?.. ఓ ఆటోడ్రైవర్‌ను చూడండి. అతను చేసిన పనికి ఇంటర్నెట్ ఫిదా అయ్యింది.

Mumbai
Mumbai : ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నప్పుడు గమ్యస్ధానానికి చేరాలంటే ఆలస్యం అవుతుందని తెలిసినప్పుడు ఎక్కడలేని చిరాకు వచ్చేస్తుంది. కార్లు, బైక్‌ల మీద వెళ్లే వారే కాదు ఆటో డ్రైవర్లకు కూడా ట్రాఫిక్ జామ్‌తో పెద్ద చిక్కే. అయితే ఆ సమయంలో ట్రాఫిక్ జామ్‌కి తిట్టుకోకుండా ఆ చికాకును అధిగమించడం ఎలా? ఓ ఆటో డ్రైవర్‌ని చూస్తే అర్ధమవుతుంది.
ముంబయి మహానగరం.. అక్కడ ట్రాఫిక్ జామ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంటే చాలామంది విసుగుతో మొబైల్ ఫోన్‌కి అతుక్కుపోతారు. కానీ ఓ ఆటో డ్రైవర్ మాత్రం తన టాలెంట్ చూపించి ఇంటర్నెట్‌ను ఆకట్టుకున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో తనను సత్యమాన్ అనే పేరుతో పరిచయం చేసుకున్న ఆటోడ్రైవర్ తన ఆటోను కరోకే స్పాట్‌గా మార్చేసుకున్నాడు. ఆటోలో మైక్రోఫోన్, స్పీకర్ అమర్చుకున్నాడు. అంధేరీ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర తన ప్రత్యేకమైన సెటప్ ద్వారా పాటలు పాడటం మొదలుపెట్టాడు.
ట్రాఫిక్ జామ్ వల్ల కలిగే చికాకు, ఇబ్బందిని మర్చిపోయి ఆనందంగా ఉండేందుకు తన ప్రతిభను భలేగా ఉపయోగించుకున్నాడు సత్యమాన్. ఇన తన పాటతో అక్కడి వారి ముఖాల్లో చిరునవ్వు తీసుకురావడానికి ప్రయత్నించాడు. ప్రస్తుతం అతను పాట పాడిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ‘ఎంత పాజిటివ్ పర్సన్’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు.
https://www.indiatoday.in/