Bengaluru : వామ్మో ఇంత నూనెతో దోశలు.. ఎగబడుతున్న జనం.. ఎక్కడో తెలుసా?

దోశలంటే ఇష్టం లేని వారు ఉండరు. స్ట్రీట్ సైడ్ నుంచి రెస్టారెంట్ల వరకు రకరకాల దోశలు అందుబాటులో ఉంచుతారు. అయితే బెంగళూరులోని ఓ రెస్టారెంట్‌లో దోశలు తయారీ విధానం చూస్తే మాత్రం.. షాకవుతారు.

Bengaluru : వామ్మో ఇంత నూనెతో దోశలు.. ఎగబడుతున్న జనం.. ఎక్కడో తెలుసా?

Bengaluru

Updated On : November 15, 2023 / 12:38 PM IST

Bengaluru : దోశలు తినడానికి చాలామంది ఇష్టపడతారు. వీధి పక్కన ఉండే స్టాల్స్ నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్తే రకరకాల దోశలు అందుబాటులో ఉంటాయి. బెంగళూరులోని ఓ రెస్టారెంట్‌లో దోశలు తయారు చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన జనం మాత్రం మండిపడుతున్నారు.

Video Viral : ప్రముఖ క్రికెటర్ ముంబయిలోని రోడ్‌సైడ్ బార్బర్ షాప్‌లో కటింగ్…వీడియో వైరల్

మసాలా దోశ, రవ్వ దోశ, ఆనియన్ దోశ, పన్నీర్ దోశ ఇలా రకరకాల దోశలు దోశ ప్రియుల నోరూరిస్తుంటాయి. కొన్ని రెస్టారెంట్లు ప్రత్యేకంగాక కొన్ని దోశ రకాలు తయారు చేయడంలో నైపుణ్యం కలిగి ఉంటాయి. బెంగళూరులోని ఓ రెస్టారెంట్‌కి సంబంధించిన వీడియో ఆన్ లైన్‌లో వైరల్ అవుతోంది. అయితే దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం మండిపడుతున్నారు. అందుకు కారణమేంటి?

వీడియోలో ఓ రెస్టారెంట్ కిచెన్‌లో చెఫ్ దోశలు వేస్తుంటాడు. అతని వెనుక జనం గుంపులుగా ఉన్నారు. దోసలు తినడానికి ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. చెఫ్ దోశలు వేయడానికి ముందు పెనాన్ని చీపురును ఉపయోగించి క్లీన్ చేసాడు. ఆ తర్వాత దోశలు వేసాడు. ఓ ఆయిల్ ప్యాకెట్ తీసుకుని దోశలపై నూనె వేయడం.. కాదు కాదు పోయడం మొదలుపెట్టాడు. ప్రతి దోశపై చాలా ఎక్కువ మొత్తంలో నూనె పోసి మధ్యలో మసాలాను పెట్టాడు. ఆ తర్వాత మసాలా పొడి చల్లి దోశలను ప్లేట్లలో అందించాడు. ‘బెంగళూరులోని అత్యంత హైటెక్ దోశ కోసం క్రేజీ రష్’ అనే క్యాప్షన్‌తో ఈ దోశల తయారీ వీడియో ఫేస్ బుక్‌ షేర్ చేసారు.

Snake In Shoe : బాబోయ్.. విద్యార్థి స్కూల్ షూలో పాము, తల్లిదండ్రులూ బీకేర్ ఫుల్.. వీడియో వైరల్

మిలియన్ల సంఖ్యలో దూసుకుపోతున్న దోశ తయారీ వీడియో చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. పెనం తుడవడానికి చెఫ్ చీపురు ఉపయోగించడంపై పలువురు విమర్శలు చేశారు. ఇంకొందరు దోశపై అంత పెద్ద మొత్తంలో నూనె వాడటంపై మండిపడ్డారు. ‘అత్యంత హైటెక్ ఆయిల్ హార్ట్ డిసీజ్ దోశ’ అని.. ‘వావ్ టేస్టీ, కొలెస్ట్రాల్ మరియు గుండె జబ్బులు ప్లేట్లో వడ్డించబడ్డాయి.. అద్భుతం’ అంటూ వెటకారంగా కామెంట్లు పెట్టారు. ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.