Viral Video : హాలీవుడ్ సీన్ కాదు.. నిజంగానే భారీ మొసలి రోడ్డుపైకి వచ్చింది.. వీడియో..!
Viral Video : వామ్మో... భారీ మొసలి ఎలా పరిగెడుతుందో చూడండి.. ఇదేదో హాలీవుడ్ మూవీలో హర్రర్ సీన్ అనుకుంటే పొరపాటే.. నిజంగానే ఓ భారీ అలిగేటర్ నదిలో నుంచి ఇలా రోడ్డుపైకి వచ్చింది.
Viral Video : వామ్మో… భారీ మొసలి ఎలా పరిగెడుతుందో చూడండి.. ఇదేదో హాలీవుడ్ మూవీలో హర్రర్ సీన్ అనుకుంటే పొరపాటే.. నిజంగానే ఓ భారీ అలిగేటర్ నదిలో నుంచి ఇలా రోడ్డుపైకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా మొసలి మంచినీటిలో జీవిస్తాయి. నదులు, సరస్సుల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆ రోడ్డుకు ఇరువైపులా నీళ్లు ఉన్నాయి. ఆ రోడ్డుపైకి నీళ్లలో నుంచి మొసలి ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఆ రోడ్డు దాటి పక్కనే ఉన్న నదిలోకి వెళ్లి మాయమైపోయింది మొసలి.
ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేనప్పటికీ ఒక బైక్ పార్క్ చేసి ఉంది. అదృష్టవశాత్తూ ఎవరూ లేకపోవడంతో ప్రాణపాయం తప్పింది. లేదంటే ఆ మొసలి కంటపడితే దానికి ఆహారం కావాల్సిందే.. ఏదిఏమైనా ఈ వీడియోను ఎవరో రికార్డు చేయగా.. ‘హెలికాప్టర్ యాత్ర’ అనే యూజర్ తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు.
అందులో మొసలి నదిలోంచి రోడ్డుపైకి రావడం చూడొచ్చు. రోడ్డుపై బైక్ తప్ప ఎవరూ కనిపించలేదు. వేగంగా దూసుకొచ్చిన మొసలి అంతే వేగంతో నదిలోకి జారుకుంది. ఈ వీడియోను క్లోజుగా చూస్తుంటే హర్రర్ మూవీ సీన్ చూసినట్టుగా ఉందని నెటిజన్లు అంటున్నారు. షాకింగ్ వీడియోను ఇప్పటివరకూ లక్షన్నరకు లైకులు రాగా.. 2.9 మిలియన్ల మంది వీక్షించారు.
Read Also : Payal Rajput: బోల్డ్ అంటే ఇదే.. స్టేజ్‌పైనే లిప్‌లాక్ ఇచ్చేసిన పాయల్!