Viral Video: బ్రహ్మపుత్ర నదిలో 120 కిలోమీటర్లు ఈదిన రాయల్ బెంగాల్ టైగర్.. వీడియో వైరల్

రాయల్ బెంగాల్ టైగర్ నదిలో ఈదుకుంటూ 120 కిలోమీటర్లు ప్రయాణించింది. ఒక దీవివైపు దూసుకొస్తుండగా స్థానికులు గుర్తించి, షాకయ్యారు. తర్వాత అధికారులకు సమాచారం అందించారు. వాళ్లు చాలా సేపు శ్రమించి ఈ పులిని బంధించారు.

Viral Video: బ్రహ్మపుత్ర నదిలో 120 కిలోమీటర్లు ఈదిన రాయల్ బెంగాల్ టైగర్.. వీడియో వైరల్

Updated On : December 21, 2022 / 8:39 PM IST

Viral Video: బ్రహ్మపుత్ర నదిలో ఒక రాయల్ బెంగాల్ టైగర్ దాదాపు 120 కిలోమీటర్లు ఈదింది. అయితే, ఈ పులిని రెస్క్యూ టీమ్ కాపాడి, బంధించింది. జూకు తరలించింది. బ్రహ్మపుత్ర నదీ తీరంలో పురాతన ఉమానంద టెంపుల్ ఉంది. ఇది బ్రహ్మపుత్ర నదిలోని, పీకాక్ ఐలాండ్ పరిధిలో ఉంటుంది.

Kapu Reservation Bill: కాపుల రిజర్వేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన.. టీటీపీ ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్ చెల్లుబాటు

ఈ దీవిలో కొందరు నివసిస్తూ ఉంటారు. ఇది అత్యంత చిన్న దీవి. ఈ దీవివైపు పులి వేగంగా ఈదుకుంటూ రావడాన్ని స్థానికులు గుర్తించారు. దీవి సమీపంలోని చిన్న గుహలో ఉన్న రాళ్ల మధ్య ఈ పులి దాక్కుని ఉంది. దీన్ని గుర్తించిన దీవిలోని వాళ్లు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే జాతీయ విపత్తు నిర్వహణా బృందాలు, పోలీసులు, అటవీ శాఖ అధికారులు పులిని బంధించాలని నిర్ణయించారు. పులికి మత్తు మందు ఇచ్చి బంధించేందుకు ప్రయత్నించారు. చాలా సేపు శ్రమించి, మత్తు మందు ఇచ్చి పులిని బంధించారు. ఒక బోనులో ఉంచి సమీపంలోని జూకు తరలించారు.

Jane Zhang: కావాలని కోవిడ్ వైరస్ అంటించుకున్న చైనీస్ సింగర్.. కారణం తెలిసి తిడుతున్న నెటిజన్లు!

అయితే, ఈ పులి 120 కిలోమీటర్ల దూరంలోని ఒరంగా నేషనల్ పార్కుకు చెంది ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. బ్రహ్మపుత్ర నది వద్దకు నీళ్లు తాగేందుకు వచ్చి, అలల తాకిడికి నదిలో పడిపోయి ఉంటుందని, ఎటు వెళ్లాలో తెలియని పులి ఇలా ఈదుకుంటూ వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. అధికారులు పులిని బంధించేంత వరకు ఇది కనీసం పది గంటలపాటు, 120 కిలోమీటర్లు ఈదిందని అధికారులు అంచనా వేస్తున్నారు.