సినిమా సీన్‌ కాదు.. రోడ్డుపై వేగంగా వచ్చి ఎగిరిపడ్డ లారీలు, కార్లు.. వీడియో వైరల్

అంత పెద్ద రోడ్డుపై స్పీడ్‌ బ్రేకర్‌ను ఏర్పాటు చేయడం ఏంటని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

సినిమా సీన్‌ కాదు.. రోడ్డుపై వేగంగా వచ్చి ఎగిరిపడ్డ లారీలు, కార్లు.. వీడియో వైరల్

Updated On : October 28, 2024 / 5:18 PM IST

సినిమా సీన్లలో కార్లు, లారీలు వేగంగా దూసుకొచ్చి రోడ్లపై ఎగిరి పడుతుంటాయి. అచ్చం అలాగే నిజజీవితంలో ఓ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఈ వీడియోను ఎక్స్‌లో ఆటోమోటివ్ ప్లాట్‌ఫారమ్ 91వీల్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ బన్నీ పునియా షేర్ చేశారు. గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్‌లో హెచ్‌ఆర్ 26 ధాబాకు ఎదురుగా సెంట్రమ్ ప్లాజా సమీపంలో ఉన్న ప్రాంతంలో వాహనాలు ఎగిరిపడ్డాయని కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు.

రోడ్డుపై కొత్తగా స్పీడ్‌ బ్రేకర్‌ను ఏర్పాటు చేయడమే ఆ వాహనాలు ఎగిరిపడడానికి కారణమని తెలుస్తోంది. అంత పెద్ద రోడ్డుపై స్పీడ్‌ బ్రేకర్‌ను ఏర్పాటు చేయడం ఏంటని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రమాదాలు జరగడానికి ఇటువంటి తీరే కారణం అవుతుందని కొందరు కామెంట్ చేశారు.

Nayanthara : కాస్మోటిక్ స‌ర్జ‌రీ చేయించుకున్న న‌య‌న‌తార..? లేడీ సూప‌ర్ స్టార్ చెప్పిన నిజం ఇదే..