విస్తారా పైలట్లు మూకుమ్మడి సిక్ లీవ్‌లు .. భారీగా రద్దవుతున్నవిమాన సర్వీసులు

విస్తారా విమానయాన సంస్థ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. పైలెట్లు, చాలావరకు ఫస్ట్ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడంతో తమ విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా తగ్గించుకోనున్నట్లు తెలిపారు.

విస్తారా పైలట్లు మూకుమ్మడి సిక్ లీవ్‌లు .. భారీగా రద్దవుతున్నవిమాన సర్వీసులు

Vistara pilot

Vistara Crisis : ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా విమానాల సర్వీస్సులను రద్దు చేస్తోంది. గత వారం రోజుల్లో 100 కంటే ఎక్కువ విమానాలు రద్దు కాగా.. మరికొన్ని ఆలస్యం అయ్యాయి. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం 50 విమానాలు రద్దు కాగా.. మంగళవారం 70 విమానాలు రద్దయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 30కిపైగా విమానాలు రద్దయ్యాయి. విమానాల రద్దుకు కారణం విస్తారా పైలట్లు మూకుమ్మడిగా సిక్ లీవ్ లు పెట్టడమేనట. వారు సిక్ లీవ్ లు పెట్టడానికి కారణం అనారోగ్య సమస్యలు కాదు.. ఎయిర్ ఇండియాలో ఎయిర్ లైన్స్ ను విలీనం చేయాలనే నిర్ణయం తరువాత కొత్త కాంట్రాక్ట్ ప్రకారం వారి జీతాల్లో కోతపై పైలట్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తగినంత మంది పైలట్లు విధులకు హాజరుకాకపోవటంతో విమానయాన సంస్థ విమానాలను రద్దు చేస్తుంది.

Also Read : Arvind Kejriwal : తీహార్ జైల్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. ఎలాంటి వ‌స‌తులు క‌ల్పించారంటే!

వాస్తవానికి గతేడాది ఎయిర్ ఇండియాను టాటా కొనుగోలు చేసింది. ఇప్పుడు ఎయిర్ ఇండియాలో ఎయిర్ విస్తారా విలీన ప్రక్రియ కొనసాగుతోంది. అటువంటి పరిస్థితిలో, ప్రస్తుత సంక్షోభానికి ఇది ప్రధాన కారణంగా మారింది. ముందస్తు సమాచారం లేకుండా విమానాయ సంస్థకు చెందిన విమానాలు రద్దు, ఆలస్యం అవుతుండటంతో పౌరవిమానయాన శాఖ వివరణ కోరింది. ప్రయాణీకుల ఇబ్బందులను పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని కేంద్రం ప్రశ్నించింది. వెంటనే స్పందించాలని నోటీసులుసైతం జారీ చేసింది.

Also Read : Viral Video : రైలులో టాయిలెట్ వ‌ద్ద‌కు వెళ్లేందుకు.. స్పైడ‌ర్‌మ్యాన్ స్టంట్‌.. వీడియో వైర‌ల్‌

ఈ విషయంపై విస్తారా విమానయాన సంస్థ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. పైలెట్లు, చాలావరకు ఫస్ట్ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడంతో తమ విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా తగ్గించుకోనున్నట్లు తెలిపారు. విస్తారా విలీన ప్రక్రియలో భాగంగా పైలట్ల పరిహారం విషయంలో ఈ ఏప్రిల్ నుంచి కొత్త ఒప్పందం అమల్లోకి వస్తోంది. కొత్త కాంట్రాక్ట్ ప్రకారం.. గతంలో 70 గంటలుగా పనివేతనం పొందిన పైలట్లు.. ఒకపై 40 పనిగంటలకు మాత్రమే స్థిరమైన వేతనాన్ని పొందే అవకాశం ఉంటుంది. దీంతో వారు విధులకు హాజరుకాకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా, ఎయిర్ విస్తారా విమానాల ఆలస్యంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఎ) సంస్థ కీలక ఆదేశాలు జారీ చేసింది. విమానయాన సంస్థ రద్దు చేసిన, ఆలస్యం అయిన విమానాలకు సంబంధించిన రోజువారీ వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాదు.. విమానాల ఆలస్యం కారణంగా ప్రయాణికులకు విమానయాన సంస్థలు అందించే నష్టపరిహారం సంబంధిత నిబంధనలను పాటించాలని విస్తారాకు సూచించింది.