Masks : అప్పటివరకు మాస్కులు ధరించాల్సిందే
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రూపాలు మార్చుకుని మానవాళిపై దాడి చేస్తోంది. కరోనా ఇప్పటికే రెండుసార్లు దేశాన్ని వణికించింది. మళ్లీ థర్డ్ వేడ్ ముప్పు పొంచివుంది.

Mask
masks must be worn by 2022 : కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రూపాలు మార్చుకుని మానవాళిపై దాడి చేస్తోంది. కరోనా ఇప్పటికే రెండుసార్లు దేశాన్ని వణికించింది. మళ్లీ థర్డ్ వేడ్ ముప్పు పొంచివుంది. దీంతో జనం గజగజ వణికిపోతున్నారు. అయితే కేసులు పెరగ్గానే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం.. కాస్త తగ్గగానే కనీసం మాస్కులు కూడా లేకుండా తిరగడం చాలా మందికి అలవాటుగా మారింది. మరికొంత మందిలో ఈ మాస్కులు ఇంకా ఎన్ని రోజులు పెట్టుకోవాలన్న సందేహాలు లేకపోలేదు.
ఓవైపు విదేశాల్లో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు మాస్కులు అవసరం లేదని అక్కడి ప్రభుత్వాలు చెబుతున్నాయి. మన దేశంలో మాత్రం రెండు డోసులు తీసుకున్నా.. మాస్కులు పెట్టుకోవడం కొనసాగించండని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ మాస్కులు ఇంకెన్నాళ్లన్న ప్రశ్నపై ఉత్పన్నమతోంది. దీనిపై నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ స్పందించారు. 2022 వరకూ మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సిందేనని స్పష్టం చేశారు.
Corona : కరోనా వైరస్ కు ముగింపు లేనట్లేనా?!
దేశంలో పండుగల సీజన్ ప్రారంభమవ్వడంతో థర్డ్‌వేవ్ ముప్పు ముంగిట్లో ఉన్నామని వీకే పాల్ చెప్పారు. వ్యాక్సిన్లు, అత్యవసర మందులు, కఠిన ఆంక్షలతోనే కరోనాకు చెక్ పెట్టగలమని పేర్కొన్నారు. ఇప్పుడే ప్రజలు రిలాక్స్ కావద్దని, అది ముప్పును మరింత పెంచుతుందని హెచ్చరించారు.
ఇప్పటికే పండుగల సందర్భంగా భారీగా ప్రజలు గుమిగూడకుండా చూడాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. కరోనా కేసులు పెరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే కఠిన ఆంక్షలతో మొదట్లోనే కట్టడి చేయాలని స్పష్టం చేసింది.