10 రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభం

Voting begins for the by-election in 54 Assembly seats 10రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికకు ఇవాళ(నవంబర్-3,2020) పోలింగ్ ప్రారంభమైంది. మధ్యప్రదేశ్ లోని 28 స్థానాలకు, గుజరాత్ లోని 8 స్థానాలకు, ఉత్తరప్రదేశ్ లోని 7స్థానాలకు,ఒడిషాలోని 2స్థానాలకు,నాగాలాండ్ లోని 2స్థానాలకు,కర్ణాటకలోని 2స్థానాలకు,జార్ఖండ్ లోని 2స్థానాలకు,తెలంగాణలోని 1స్థానానికి,ఛత్తీస్ ఘడ్ లోని 1స్థానానికి,హర్యానాలోని 1స్థానానికి నేడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
ఉప ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ లకు చేరుకుంటున్నారు ఓటర్లు.కరోనా నేపథ్యంలో ఓటర్లందరూ మాస్క్ లు ధరించి పోలింగ్ బూత్ ల దగ్గర సామాజిక దూరం పాటిస్తున్నారు.
https://10tv.in/ts-finance-minister-harish-rao-speccial-interview-on-dubbaka-by-elections/
కాగా, ఈ ఏడాది మార్చిలో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి జై కొట్టడంతో కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి..శివారాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో జరుగుతున్న 28 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.