భారత్ మాతా కీ జై కావాలా? జిన్నా వాలీ ఆజాదీ కావాలా? సీఏఏ వ్యతిరేకులకు ప్రశ్న
ఢిల్లీలోని షాహీన్ బాగ్ దగ్దర పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న వారిని ఉద్దేశించి కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. సీఏఏ వ్యతిరేకులకు ఆయన

ఢిల్లీలోని షాహీన్ బాగ్ దగ్దర పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న వారిని ఉద్దేశించి కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. సీఏఏ వ్యతిరేకులకు ఆయన
ఢిల్లీలోని షాహీన్ బాగ్ దగ్దర పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న వారిని ఉద్దేశించి కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. సీఏఏ వ్యతిరేకులకు ఆయన ఓ ప్రశ్న సంధించారు. మీకు.. భారత్ మాతాకీ జై కావాలా? లేక జిన్నా వాలీ ఆజాదీ కావాలా? అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. ఢిల్లీ ప్రజలు ఏది కావాలో నిర్ణయించుకోవాలన్నారు. ఆప్, కాంగ్రెస్ పార్టీలపై మంత్రి ఫైర్ అయ్యారు. మైనార్టీల మెదళ్లలో విషం నింపుతున్నాయని మండిపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి.
సీఏఏపై మాటల యుద్ధం:
ఫిబ్రవరి 8న 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఆప్, కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరీ ముఖ్యంగా సీఏఏ విషయంలో. సీఏఏ ఆధారంగా చేసుకుని ఆప్, కాంగ్రెస్ బీజేపీని టార్గెట్ చేశాయి. బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టాయి. బీజేపీ కూడా ఘాటుగానే కౌంటర్ ఇస్తోంది. ఎదురుదాడికి దిగుతోంది.
కుట్ర జరుగుతోంది:
”అక్కడ జిన్నా వాలీ ఆజాదీ కావాలనే స్లోగన్ వినిపిస్తోంది. ఇప్పుడు ఢిల్లీ ప్రజలు నిర్ణయించుకునే సమయం వచ్చింది. జిన్నా వాలీ ఆజాదీ కావాలా? భారత్ మాతా కీ జై కావాలా? ఏ నినాదం కావాలో మీరే నిర్ణయించుకోండి” అని ఓ మీడియా సమావేశంలో ఢిల్లీ ఓటర్లను ఉద్దేశించి కేంద్ర మంత్రి కోరారు. దేశ రాజధానిలో సీఏఏ వ్యతిరేక ఆందోళనల వెనుక కాంగ్రెస్, ఆప్ హస్తం ఉందని మంత్రి ఆరోపించారు. ఆ రెండు పార్టీలు ముందుండి మరీ ఈ ఆందోళనలకు సారథ్యం వహిస్తున్నారని కేంద్రమంత్రి అన్నారు.