పేరెంట్స్ డైలీ శృంగారం చేసుకునేలా చూడాలట.. యూట్యూబర్ల వెకిలి కామెడీ.. ఒక్కొక్కరికి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్న నెటిజన్లు

ఆ షోలో ఇంతటి ఘోరమైన కామెంట్లను చేసిన అతడిని ఏం చేసినా ఫర్వాలేదని నెటిజన్లు అంటున్నారు.

పేరెంట్స్ డైలీ శృంగారం చేసుకునేలా చూడాలట.. యూట్యూబర్ల వెకిలి కామెడీ.. ఒక్కొక్కరికి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్న నెటిజన్లు

Ranveer Allahbadia

Updated On : February 10, 2025 / 3:50 PM IST

అతడి పేరు రణ్‌వీర్ అలహాబాదియా.. ఓ ఫేమస్‌ యూట్యూబర్‌.. ఇతడిని బీర్బిసెప్స్ అని కూడా పిలుస్తుంటారు. బీర్బిసెప్స్ పేరుతోనే అతడికి యూట్యూబ్‌ చానెల్‌ ఉంది. దానికి ఏకంగా 8.31 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

అతడు తాజాగా యూట్యూబ్‌లో చేసిన ఓ సూచన వల్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇండియాస్​ గాట్​ లేటెంట్​ షోలో రణ్‌వీర్‌ అలహాబాదియా పలు వ్యాఖ్యలు చేశాడు. తల్లిదండ్రులు శృంగారంలో పాల్గొంటున్న సమయంలో చూస్తావా అని రణ్‌వీర్‌ అలహాబాదియా ప్రశ్న అడిగాడు.

దీంతో అతడిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. ఇటువంటి ప్రశ్న అడగడం ఏంటని నిలదీస్తున్నారు. ఇప్పటికే అలహాబాదియాపై ముంబై కమిషనర్​తో పాటు మహారాష్ట్ర మహిళా కమిషన్​కు ఫిర్యాదులు వచ్చాయి.

సమయ్​ రైనా ఇండియాస్​ గాట్​ లేటెంట్​ షో నిర్వహిస్తుంటారు. తాజాగా, ఇందులో పలువురు కంటెంట్ క్రియేటర్లు పాల్గొన్నారు. వారిలో రణ్​వీర్​ అలహాబాదియాతో పాటు ఆశిష్ చంచ్లానీ, జస్‌ప్రీత్‌ సింగ్, అపూర్వ ముఖిజా కూడా పాల్గొన్నారు.

Also Read: కిరణ్ రాయల్‌పై ఆరోపణలు చేసిన లక్ష్మి అరెస్ట్.. తప్పించుకు తిరుగుతున్న ఆమెను పోలీసులు ఎలా దొరకబట్టారో తెలుసా?

ఆ సమయంలో ఒక కంటెస్టెంట్​తో రణ్​వీర్​ అలహాబాదియా మాట్లాడుతూ.. పేరెంట్స్‌ శృంగారం చేస్తుండడాన్ని జీవితం మొత్తం చూస్తూనే ఉంటావా అని అడిగాడు. ఒకసారి చూసి, లైఫ్ మొత్తం చూడకుండా ఉండగలవా అని అన్నాడు.

దీంతో ఆ షోలో పాల్గొన్న వారు విస్మయానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రణ్​వీర్​ అలహాబాదియాను వెంటనే అరెస్టు చేయాలని ఆయన వల్ల సమాజానికి కీడేగానీ మంచి ఏ మాత్రం జరగదని నెటిజన్లు అంటున్నారు.

ఇటువంటి వారి యూబ్యూబ్‌ చానెళ్లను కూడా బ్యాన్‌ చేయాలని కొందరు డిమాండ్ చేశారు. ఆయన​ చేసిన కామెంట్లపై ఇద్దరు లాయర్లు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇండియాస్​ గాట్​ లేటెంట్​ షో ఇటీవల పాల్గొన్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

రణ్​వీర్​ అలహాబాదియా కామెంట్స్‌ మహిళను కించపరిచేలా ఉన్నాయని పలువురు మండిపడుతున్నారు. దీనిపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​ సైతం స్పందించారు. దీనిపై తనకు సమాచారం అందిందని చెప్పారు.

కొన్ని విషయాలను ఆ షోలో తప్పుగా చెప్పారని అన్నారు. దేశంలో అందరికీ వాక్ స్వాతంత్ర్యం ఉంటుందని, అది ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించకూడదని చెప్పారు. కాగా, రణ్​వీర్​ అలహాబాదియాతో పాటు ఆ షోలో పాల్గొన్న ఆశిష్ చంచ్లానీ, జస్‌ప్రీత్‌ సింగ్, అపూర్వ ముఖిజా కూడా నెటిజన్లు మండిపడుతున్నారు.