మీరు 15శాతమే.. మేం 80 శాతం: CAAపై బీజేపీ ఎమ్మెల్యే

ఏదేమైనా CAAపై వెనక్కి తగ్గేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేస్తుంటే దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మేర బెంగళూరులోని సోమశేఖర్ రెడ్డి అనే బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు ఉంది కేవలం 15శాతం మాత్రమే. మేం 80శాతం మంది ఉన్నాం. మీరు కేవలం మైనారిటీ అంతే. మెజారిటీగా ఉన్న వాళ్లంతా వీధుల్లోకి వస్తే మీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండని కర్నాటకలోని బళ్లారిలో ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
‘పబ్లిక్ ప్రోపర్టీని పాడుచేయాలనుకుంటే ఉత్తరప్రదేశ్ సీఎం చెప్పిన గుణపాఠమే మీకూ చెప్తాం. CAAపై జరిగిన ఆందోళనల్లో గొడవలుపడినా.. మీకు ట్రీట్‌మెంట్ చేసేది హిందూ డాక్టరే. మీ గాయాలకు ఆయనే మందేయాలి’ అని అంటూనే సీఏఏకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన నాయకులందరిపై ప్రశంసలు కురిపించాడు.
డిసెంబరు 19న జరిగిన అల్లర్లలో పోలీసులు ఇద్దరు వ్యక్తులపై షూటింగ్ జరిపారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రిని ప్రస్తావిస్తూ.. ఇలా చెప్పారు. ‘ఓ సారి ఆస్ట్రేలియా పీఎం చెప్పినట్లు.. ఇది నా దేశం. మా దేశం. ఇక్కడ ఉండాలంటే నియమాలకు లోబడే ఉండాలి. లేదంటే దేశం వదిలిపోవాలి’ అని చెప్పిన మాటలు గుర్తుచేశారు.