విపక్షాల ఇండియా కూటమికి షాకిచ్చిన దీదీ.. రాహుల్ పాదయాత్రపై కీలక వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మొత్తం 42 లోక్ సభ స్థానాలున్నాయి. ఇందులో ప్రస్తుతం రెండు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ అక్కడ విజయం సాధించడం జరిగింది.

విపక్షాల ఇండియా కూటమికి షాకిచ్చిన దీదీ.. రాహుల్ పాదయాత్రపై కీలక వ్యాఖ్యలు

Mamata Banerjee

Mamata Banerjee : 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల భారత కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కూటమిలో కీలక నేతగాఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో టీఎంసీ ఒంటిరిగానే పోటీ చేస్తుందని, ఎవరితోనూ పొత్తుతో పోటీకి వెళ్లదని అన్నారు. కూటమిలోని పార్టీలతో తమ ప్రతిపాదలన్నీ తిరస్కరణకు గురయ్యాయని, అందుకే ఒంటిరిగా బీజేపీని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యామని మమతా బెనర్జీ పేర్కొన్నారు.

Also Read :  ప్రత్యేక హోదాపై ఎందుకు ప్రశ్నించరు..? బీజేపీతో వైసీపీ కంటికి కనిపించని పొత్తు పెట్టుకుంది

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర గురువారం పశ్చిమ బెంగాల్ లోకి కుచ్ బెహార్ వద్ద ప్రవేశిస్తుంది. ఏడు జిల్లాల్లో ఐదు రోజులు మొత్తం 523 కిలో మీటర్లు ఈ యాత్ర సాగుతుంది. తాజాగా రాహుల్ పాదయాత్రపై మమతా బెనర్జీ స్పందించారు. రాహుల్ యాత్రపై కనీసం సమాచారంకూడా ఇవ్వలేదని, దీనిపై కాంగ్రెస్ వారు ఏమీ చర్చించలేదని మమత అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టీఎంసీ బెంగాల్ లో ఒంటిరిగానే పోటీ చేస్తుంది. మరోవైపు ఇండియా కూటమిలో కొనసాగుతామని మమతా బెనర్జీ చెప్పారు.

Also Read : బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ కేసులో మరో ట్విస్ట్ .. తెరపైకి జూబ్లీహిల్స్ కేసు

మమతా బెనర్జీ తాజా ప్రకటన ఇండియా కూటమికి బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. ఇండియా కూటమిలోని 28 పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ తరువాత టీఎంసీనే పెద్ద పార్టీ. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మొత్తం 42 లోక్ సభ స్థానాలున్నాయి. ఇందులో ప్రస్తుతం రెండు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ అక్కడ విజయం సాధించడం జరిగింది. ఇండియా కూటమిలో భాగంగా వచ్చే లోక్ సభ ఎన్నికలకు 10 నుంచి 12 పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ పార్టీకి కేటాయించాలని ఇటీవల కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీని కోరింది. కేవలం రెండు స్థానాలు మాత్రమే ఇస్తామని మమతా తేల్చిచెప్పారు. అవికూడా ఇప్పుడు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలనే ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానంకు మమతా చెప్పారు. ఆ ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ నేతలు ఇండియా కూటమి ముందు ఉంచారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి తాను చేసిన ప్రతిపాదనపై ఆపార్టీ పెద్దల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు.. కనీసం స్పందించలేదని మమతా తాజాగా పేర్కొన్నారు. దీంతో తాము వచ్చే లోక్ సభ ఎన్నికలకు ఒంటిరిగానే బరిలోకిదిగుతామని మమత కుండబద్దలు కొట్టేశారు.

బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధిరంజన్ చౌదరి మమత వ్యాఖ్యలపై స్పందించారు. మమత బెనర్జీ అవకాశవాది అని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ సహాయంతో ఆమె గెలిచిందన్న విషయం మర్చిపోవద్దని సూచించారు. మేము అడిగినన్ని సీట్లు మమత ఒప్పుకోవటం లేదని, కనీసం చర్చల ద్వారా సీట్ల పంపకం విషయాన్ని కొలిక్కి తెచ్చేందుకు ఆమె ప్రయత్నించడం లేదని అధిరంజన్ చౌదరి పేర్కొన్నారు.