Parliament Special Sessions: బీజేపీ ఎంపీలకు కూడా తెలియని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎంజెండా.. లీకుల నుంచి తెలిసిన విషయం ఏంటంటే?
ఈ సెషన్‌లో అధికార బీజేపీ సమర్పించబోయే ఎజెండాపై ప్రతి ఒక్కరు ఒక కన్నేసి ఉంచారు. నిజానికి ప్రభుత్వం ఏ ఎజెండాతో ఈ సమావేశాలు నిర్వహిస్తోందో చాలా మంది బీజేపీ నేతలకు కూడా తెలియదు. అసలు ఎజెండా ఏంటో వెల్లడించాలని అధికార పక్షాన్ని ప్రతిపక్షం నిరంతరం డిమాండ్ చేస్తోంది.

Parliament Special Sessions: జీ20 సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ సమ్మిట్ కోసం మన దేశంలో చాలా సన్నాహాలు జరిగాయి. నిన్నటి వరకు దేశ వ్యాప్తంగా జీ20 గురించే చర్చ జరిగింది. అయితే నేడు దాని దృష్టంతా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వైపుకు మళ్లింది. సెప్టెంబర్ 18 నుంచి ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఇకపోతే, ఈ సెషన్‌లో అధికార బీజేపీ సమర్పించబోయే ఎజెండాపై ప్రతి ఒక్కరు ఒక కన్నేసి ఉంచారు. నిజానికి ప్రభుత్వం ఏ ఎజెండాతో ఈ సమావేశాలు నిర్వహిస్తోందో చాలా మంది బీజేపీ నేతలకు కూడా తెలియదు. జీ20 సమావేశాలకు ముందు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ ప్రత్యేక అజెండా గురించి ఎక్స్(ట్విట్టర్)లో ఒక ట్వీట్ ద్వారా తెలిపారు. ఆ ట్వీట్ లో “పార్లమెంటు ప్రత్యేక సెషన్ (17వ లోక్‌సభ 13వ సెషన్, రాజ్యసభ 261వ సెషన్) సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరుగుతాయి. ఇందులో 5 సమావేశాలు ఉంటాయి. ఈ సెషన్‌లో అమృతకల్ సమయంలో, పార్లమెంటులో అర్థవంతమైన చర్చ జరుగుతుంది. దీని పట్ల నేను ఆశావాదంతో ఉన్నాను” అని రాసుకొచ్చారు.
ప్రత్యేక సెషన్ ఎజెండా ఏమిటి?
జీ20 సమ్మిట్‌కు ముందే, అందరి దృష్టి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై ఉంది. అసలు ఎజెండా ఏంటో వెల్లడించాలని అధికార పక్షాన్ని ప్రతిపక్షం నిరంతరం డిమాండ్ చేస్తోంది. సమావేశాల ఎజెండాను ముందుగానే ఉంచే సంప్రదాయం లేదని మోదీ ప్రభుత్వం తిప్పికొట్టింది. సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశానికి ప్రభుత్వం సమర్పించిన ఎజెండా గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ఇందులో ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ అనే అంశంపై ఈ సమావేశంలో చర్చించవచ్చని, చట్టం చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు.
Rishi Sunak: ఇండియా పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లగానే కష్టాలు ఎదుర్కొంటున్న బ్రిటన్ ప్రధాని
మరోవైపు, దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా శాశ్వతంగా మార్చడం సెషన్ యొక్క ఎజెండా అని కూడా చర్చ జరుగుతోంది. అయితే, ప్రత్యేక సమావేశాల ఎజెండాపై ఇప్పటి వరకు ఊహాగానాలు మాత్రమే జరుగుతున్నాయి. ఇటీవల జీ20 శిఖరాగ్ర సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడం, చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ కావడం వల్ల దేశంలో చాలా సంతోషకరమైన వాతావరణం ఉంది. అటువంటి పరిస్థితిలో, దేశం ముందు తన సానుకూల ఇమేజ్‌ను సృష్టించడానికి ప్రభుత్వం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అనుకుంటోందని కూడా అంటున్నారు.
జమ్మూ కాశ్మీర్‌పై ఎజెండా ఉంటుందా?
ఈ సెషన్‌లో రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపే కొన్ని చర్యల్ని ప్రభుత్వం తీసుకోబోతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తిరిగి ఇచ్చే ప్రతిపాదన కూడా ఉందట. యూనిఫాం సివిల్ కోడ్, దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం లేదా ‘ఒకు దేశం, ఒకే ఎన్నికలు’ దిశగా అడుగులు వేయడం లాంటివి జరగొచ్చని బలంగా విశ్వసిస్తున్నారు.
దీనికి ముందు ఎన్నిసార్లు ప్రత్యేక సమావేశాన్ని పిలిచారు?
జూన్ 2017: నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఈ సమావేశానికి ముందు కూడా ఒకసారి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. జూన్ 30, 2017న, వస్తు-సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు కోసం మోదీ ప్రభుత్వం మొదటిసారిగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని పిలిచింది.
2015: 26 నవంబర్ 2015న ప్రత్యేక సెషన్‌ను పిలిచారు. ఆ రోజు బీఆర్ అంబేద్కర్‌కు నివాళులర్పించేందుకు ప్రభుత్వం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 2015లో అంబేద్కర్ 125వ జయంతిని దేశం జరుపుకుంది. అదే సంవత్సరం నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించారు.
2002: 2015 సంవత్సరానికి ముందు, 2002లో కూడా ఒక ప్రత్యేక సెషన్‌ను నిర్వహించారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వం మార్చి 26న ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఉగ్రవాద నిరోధక బిల్లును ఆమోదించింది.
1997: ‘క్విట్ ఇండియా ఉద్యమం’ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు 9, 1997 అర్ధరాత్రి పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
మహాకూటమిపై బీజేపీ వ్యూహం
2024లో లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల తేదీ సమీపిస్తున్న తరుణంలో బీజేపీ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా 28 ప్రతిపక్ష పార్టీలు కూటమిని ఏర్పాటు చేశాయి. దీనికి ‘I.N.D.I.A’ (ఇండియా) అని పేరు పెట్టారు. ఇక డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల అనంతరం ఇండియా కూటమిని సనాతన ధర్మానికి విరుద్ధమని ప్రకటించేందుకు అధికార బీజేపీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. సనాతన ధర్మాన్ని “కరోనావైరస్, మలేరియా, డెంగ్యూ”తో ఉదయనిధి పోల్చారు. అప్పటి నుంచి మహాకూటమిలో చేరిన పార్టీలపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది.
Hong Kong : దక్షిణకొరియా మహిళపై లైంగిక వేధింపులు, హాంగ్‌కాంగ్‌లో భారతీయుడు అరెస్ట్
ఈ ప్రకటన వల్ల కలిగే నష్టాన్ని పసిగట్టిన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే), ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే డీఎంకే అధినేతకు దూరమయ్యాయి. మరి ఈ అంశాన్ని బీజేపీ ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి. అయితే, ఈ ప్రకటనను స్పష్టం చేస్తూ ఉదయనిధి మరో ప్రకటన విడుదల చేశారు, అందులో ‘‘నేను సనాతన ధర్మాన్ని వ్యతిరేకించాను. కానీ ప్రజల పూజించే హక్కును వ్యతిరేకించలేదు. నేను మారణహోమం అనే పదాన్ని ఎప్పుడూ ఉపయోగించలేదు. వారు (బీజేపీ) నా వ్యాఖ్యలను తప్పుగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. నేను ఏ మతానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ మతంలోని కుల వివక్షకు వ్యతిరేకంగా మాట్లాడాను’’ అని అన్నారు.
Anand Mahindra : G20 లీడర్లకు అరకు కాఫీ బహుమతిగా ఇచ్చిన మోడీ.. హ్యాపీ ఫీల్ అయిన ఆనంద్ మహీంద్రా
ఇప్పుడు ఉదయనిధి చేసిన ఈ ప్రకటన వల్ల ప్రతిపక్షాలు భారీ నష్టాన్ని చవిచూశాయి. ఎన్నికల వరకు ఈ సమస్య ముగియాలని బీజేపీ అయితే కోరుకోదు. అటువంటి పరిస్థితిలో, బీజేపీ నాయకులు ఈ ప్రకటనను వీలైనంత వరకు ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు.