మీ డివైజ్ ఇదేనా? : WhatsApp Top Tricks ఇదిగో!

  • Published By: sreehari ,Published On : January 6, 2020 / 01:17 PM IST
మీ డివైజ్ ఇదేనా? : WhatsApp Top Tricks ఇదిగో!

ఫేస్ బుక్ సొంత మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూనే ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన చాట్ యాప్స్ లలో వాట్సాప్ అనడంలో ఆశ్చర్యపడక్కర్లేదు. ఒక్క భారత్ లోనే వాట్సాప్ యూజర్లు 400 మిలియన్ల మంది ఉన్నారు. 2010 నుంచి ఇండియన్ మార్కెట్లో వాట్సాప్ షేక్ చేస్తోంది. ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను యాడ్స్ చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది.

2015లోనే వాట్సాప్ వెబ్ వెర్షన్ కూడా రిలీజ్ చేసింది. ఈ వెర్షన్ ద్వారా యూజర్లు మొబైల్ వెర్షన్ మాత్రమే కాకుండా డెస్క్ టాప్ (పర్సనల్ కంప్యూటర్లు) కూడా ఈజీగా వాడుకోవచ్చు. మొబైల్ అప్లికేషన్ ఆఫర్ చేసే దాదాపు అన్ని ఫీచర్లను వెబ్ వెర్షన్ కూడా ఆఫర్ చేస్తోంది. కానీ, డెస్క్ టాప్ బేసిడ్ వెర్షన్ ఇంటర్ ఫేస్ ద్వారా ఆడియో, వీడియో కాల్స్ చేయడం కుదరదు. అయితే, ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్ టాప్ యూజర్లంతా వాట్సాప్ లో కొన్ని టాప్ ట్రిక్స్ వాడుకోవచ్చు. అవేంటో ఓసారి చూద్దాం..

1. వాట్సాప్‌లో తక్కువ డేటా వాడకం :
వాట్సాప్ మొబైల్ యాప్, వాట్సాప్ వెబ్ వెర్షన్ యూజర్లు తమ డేటాను అవసరానికి తగినట్టుగా వాడుకోవచ్చు. కొన్ని ఫీచర్ల సాయంతో మీ డేటాను సేవ్ చేసుకోవచ్చు. ఆటోమాటిక్ మీడియా డౌన్ లోడ్ ఆప్షన్ టర్న్ ఆఫ్ చేస్తే చాలు.. మీ డేటాను ఈజీగా సేవ్ చేసుకోవచ్చు.
* Whatsapp ఓపెన్ చేయండి.
* Settings లోకి వెళ్లండి.
* Data, Storage Usageపై Tap చేయండి.
* media Auto Download సెక్షన్ కింద Turn off చేయండి.

2. వీడియోలను GIF మార్చడం :
వాట్సాప్ లో కెమెరా ఫీచర్ ద్వారా వీడియోలను యూజర్లు కన్వర్ట్ చేసుకోవచ్చు. 6 సెక్షన్ల కంటే తక్కువగా ఉండే వీడియోలను GIF ఫార్మాట్లోకి మార్చేసుకోవచ్చు. ఈ ఫీచర్ వాడాలంటే.. ముందుగా యూజర్లు తమ ఫోన్ గ్యాలరీ నుంచి వీడియో లేదా కొత్త వీడియోను రికార్డు చేయాల్సి ఉంటుంది. వాట్సాప్ కుడివైపు భాగంలో కనిపించే toggle switch పై క్లిక్ చేస్తే చాలు.. సాధారణ వీడియో కాస్తా GIF లోకి మారిపోతుంది. ఆ తర్వాత యూజర్లు GIF ఆప్షన్ పై Tap చేసి Send బటన్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది.

3. Font ఫీచర్లు :
వాట్సాప్ యూజర్లు ఫాంట్ ఫీచర్లను ఈజీగా వినియోగించుకోవచ్చు. బోల్డ్, ఇటాలిసైజ్, స్ట్రైక్ థ్రో వంటి ఫాంట్స్ వాడుకోవచ్చు. దీనికి యూజర్లు ముందు ఫాంట్ ఫార్మాట్‌ ప్రారంభంలో, టెక్స్ట్ చివరిలోనూ సింబల్ ఎంటర్ చేయాలి. ఇటాలిక్ ఫాంట్ కోసం ( _ ) సింబల్ వాడాలి. అదేవిధంగా స్ట్రయిక్-థ్రో టెక్స్ట్ కోసం Tilde ‘~ ’ సింబల్ వాడాల్సి ఉంటుంది.

4. PIP mode :
వాట్సాప్ మరో ఆకర్షణీయ ఫీచర్ ఒకటి ఫిక్చర్ ఇన్ ఫిక్చర్ (PIP) అని పిలుస్తారు. దీని ద్వారా యూజర్లు ఫేస్ బుక్ లేదా యూట్యూబ్ నుంచి వీడియోలను Watch చేయొచ్చు. బ్యాక్ గ్రౌండ్ లో టెక్స్ట్ కూడా కనిపిస్తుంది. ఆస్తకరమైన విషయం ఏంటంటే? మీకు వీడియోను షేర్ చేసిన వ్యక్తితోనే చాట్ చేయడం కాదు.. వాట్సాప్ లోని ఇతర కాంటాక్టుల వారితో కూడా చాటింగ్ చేసుకోవచ్చు. వాట్సాప్ క్లోజ్ చేసేంత వరకు ఈ వీడియో ప్లే అవుతునే ఉంటుంది.

5. Stickers :
వాట్సాప్ యూజర్లు ఫొటోలు, వీడియోలు, GIF, emojisలను తమ స్నేహితులతో షేర్ చేసుకోవచ్చు. చాటింగ్ చేసే సమయంలో స్టిక్కర్లను వాడితే ఆకర్షణగా ఉంటుంది. Emotion ఆప్షన్ దగ్గర text bar ఓపెన్ చేసి.. Stickers ఆప్షన్ Click చేయండి. కిందివైపు ఎడమభాగంలో GIF ఆప్షన్ ఉంటుంది. థర్డ్ పార్టీ యాప్ ద్వారా కూడా ఈ స్టిక్కర్లను యాక్సస్ చేసుకోవచ్చు.