శత్రువులపై దాడులు చేస్తే…ఇక్కడ కొందరు ఏడ్చారు
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో మరోసారి విపక్షాలపై విరుచుకుపడ్డారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో మరోసారి విపక్షాలపై విరుచుకుపడ్డారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో మరోసారి విపక్షాలపై విరుచుకుపడ్డారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.శుక్రవారం(ఏప్రిల్-5,2019)ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహాలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ…ఉగ్రవాదులకు వారి భాషలో సమాధానం ఇవ్వడం కొంతమందికి నచ్చడం లేదన్నారు.భారత్ తన శత్రువులను ధ్వంసం చేస్తే, ఇక్కడ కొందరు ఏడవడం ప్రారంభించారన్నారు.
Read Also : ఏపీలో ఐటీ దాడులు : రాజకీయ రంగు పులుముతారా – జీవీఎల్
ప్రపంచ దేశాల ముందు పాక్ నిజస్వరూపం బయటపడినప్పుడు…మనదేశంలోని కొంతమంది మాత్రం పాక్ కు మద్దతుగా మాట్లాడుతున్నారని విపక్షాలపై నిప్పులు చెరిగారు.తనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)అత్యున్నత పురస్కారం జయాద్ మెడల్ ప్రకటించడంపై ఈ సందర్భంగా UAE ప్రభుత్వానికి,ప్రజలకు మోడీ ధన్యవాదాలు తెలిపారు.భారత్-యూఏఈ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడేందుకు మోడీ చేసిన కృషికి గానూ ఈ అవార్డును యూఏఈ అధ్యక్షుడు ఖలీఫా బిన్ జయాద్ ప్రకటించారు.
Read Also : బై..బై బాబు : జగన్ను సీఎం చేయండి – షర్మిల