Covavax : భారత్ లో మరో కోవిడ్ వ్యాక్సిన్..అత్యవసర వినియోగానికి WHO అనుమతి
సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ కోవోవాక్స్ అత్యవసర వినియోగానికి శుక్రవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఆమోదం తెలిపింది. వ్యాక్సిన్ సమర్థత, సేఫ్టీన

Vaccine (1)
Covavax : సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ కోవోవాక్స్ అత్యవసర వినియోగానికి శుక్రవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఆమోదం తెలిపింది. వ్యాక్సిన్ సమర్థత, సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చని తెలిపింది.
కరోనా ఎన్నిసార్లు మ్యుటేషన్ చెందినా.. ఎన్ని కొత్త వేరియంట్లు వచ్చినా.. వాటికి అడ్డుకట్ట వేయడానికి వ్యాక్సిన్లే ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రాణాపాయ స్థితి నుంచి ప్రజలను కాపాడేది వ్యాక్సిన్లే. అందుకే కోవోవాక్స్‌ను కూడా రివ్యూ చేశాం. దాని క్వాలిటీ, భద్రత, సమర్థత.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక.. భారత డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చాక.. మేము ఈ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపాం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
కోవోవాక్స్‌ను నోవావాక్స్ సంస్థతో కలిసి సీరం సంస్థ అభివృద్ధి చేసింది. కోవోవాక్స్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలపడంతో సీరం సంస్థ సీఈవో సంతోషం వ్యక్తం చేశారు. కోవిడ్ 19పై పోరాటంలో ఇది మరో మైలురాయి అంటూ ఆయన ఓ ట్వీట్ చేశారు.
కోవావాక్స్ కూడా రెండు డోస్ ల వ్యాక్సిన్. 3 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు కూడా ఈ వ్యాక్సిన్ ఉపయోగించబడుతుందని, 2022 మధ్యలో దీనిని అందుబాటులోకి తీసుకొస్తామని పూనావాలా ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. ప్రారంభించబడుతుందని పూనావాలా ఇంతకు ముందు చెప్పారు. కాగా,ఇప్పటికే సీరమ్ సంస్థ.. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తోన్న విషయం తెలిసిందే.
ALSO READ Rashmika Mandanna: క్రస్మిక అందాల వల.. పుష్ప ప్రమోషన్స్‌లో గ్లామర్ షో!