Karnataka : రెండవ భార్య చేతిలో రియల్టర్ దారుణ హత్య
భర్త పరాయి పురుషుల దగ్గరకు వెళ్ళమని వేధింపులకు గురిచేస్తున్న భర్తను దారుణంగా హత్యచేసింది రెండో భార్య. అనంతరం పోలీసుల ముందు లొంగిపోయింది.

Karnataka
Karnataka : రెండవ భార్య చేతిలో భర్త దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలోని నేలమంగల తాలూకా మదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పలార్ స్వామి అలియాస్ స్వామిరాజ్ (50) రియలెస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. యితడు ఆరేళ్లక్రితం నేత్ర అనే బ్యూటీషీయన్ పెళ్లి చేసుకున్నాడు. ఆమె కోసం విపరీతంగా డబ్బు ఖర్చు చేశాడు. తాజాగా నేత్రకు హారో క్యాతనహళ్లి వద్ద రూ.6 కోట్లు ఖర్చుపెట్టి పెద్ద బంగ్లా నిర్మించి ఇచ్చాడు.
చదవండి : Hyderabad Crime : వంటిపై చిరిగిన బట్టలు.. పక్కనే బీరు బాటిల్.. అనుమానాస్పద స్థితిలో డ్యాన్సర్ మృతి
అయితే వీరిమధ్య గత కొంతకాలంగా చిన్నచిన్న గొడవలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.. ఈ నేపథ్యంలోనే నేత్ర ఆదివారం రాత్రి భర్త పలార్ స్వామి తలపై రాడ్డుతో బలంగా కొట్టింది. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. అనంతరం మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయింది నేత్ర.. తన భర్త పరాయి పురుషుల వద్దకు వెళ్లాలని బలవంతం చేసేవాడని.. తనకు అది ఇష్టం లేక భర్తను హత్యచేశానని తెలిపింది. అయితే తన భర్త తమకు దగ్గరవుతున్నాడనే నెపంతోనే నేత్ర అతడిని హత్యచేసిందని మొదటి భార్య ఆరోపిస్తున్నారు.
చదవండి : Hyderabad Crime : స్నేహితుడి భార్యపై అఘాయిత్యం.. వీడియోలు తీసి వెకిలి చేష్టలు