Wife Nagin: నా భార్య నాగినిగా మారి భయపెడుతుంది, నిద్ర లేకుండా చేస్తుంది- ఓ భర్త వింత ఫిర్యాదు..
ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి హాజరైన అధికారులు ఈ అసాధారణ, వింత ఫిర్యాదుతో షాక్ కి గురయ్యారు. అతడు చెప్పింది విన్నాక వారి నోట మాట రాలేదు.

Wife Nagin: ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో చిత్ర విచిత్రమైన ఘటన ఒకటి వెలుగుచూసింది. ఓ భర్త వింత ఫిర్యాదు చేశాడు. రాత్రి కాగానే నా భార్య నాగినిగా మారుతుంది, నన్ను భయపెడుతోంది, నాకు నిద్ర లేకుండా చేస్తోంది అంటూ ఓ భర్త లబోదిబోమంటున్నాడు. నాకు సాయం చేయండి మహాప్రభో అంటూ జిల్లా మేజిస్ట్రేట్ కు ఆ భర్త ఫిర్యాదు చేశాడు.
ఓ వ్యక్తి.. సీతాపూర్ జిల్లా మేజిస్ట్రేట్ ను ఆశ్రయించాడు. అతడు అసాధరణ ఫిర్యాదు చేశాడు. తన భార్య నాగినిగా మారి తనను భయపెట్టడం కారణంగా తాను నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని ఆ వ్యక్తి వాపోయాడు.
అక్టోబర్ 4న జరిగిన ‘సమాధాన్ దివాస్’ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార దినం) సందర్భంగా మహముదాబాద్ తహసీల్‌లోని లోధాసా గ్రామానికి చెందిన ఫిర్యాదుదారుడు మెరాజ్.. జిల్లా మేజిస్ట్రేట్ అభిషేక్ ఆనంద్ ముందు ఈ వింత ఫిర్యాదు ఉంచాడు.
తన భార్య నసిమున్ మానసిక పరిస్థితి బాగోలేదన్నాడు. రాత్రులు ‘నాగిన్’ (ఆడ పాము) లాగా నటిస్తూ.. బుసలు కొడుతూ.. తనను భయపెడుతుందని మెరాజ్ ఆరోపించాడు. తాను పదే పదే వేడుకున్నప్పటికీ స్థానిక పోలీసులు ఈ విషయంలో చర్య తీసుకోలేదన్నాడు. అందుకే సాయం కోసం జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించాల్సి వచ్చిందని అతడు వాపోయాడు.
ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి హాజరైన అధికారులు ఈ అసాధారణ, వింత ఫిర్యాదుతో షాక్ కి గురయ్యారు. అతడు చెప్పింది విన్నాక వారి నోట మాట రాలేదు. అతడి ఆవేదనను అర్థం చేసుకున్న జిల్లా మేజిస్ట్రేట్.. ఈ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. మాకు ఫిర్యాదు అందింది, దీనిపై దర్యాఫ్తు చేస్తున్నాం అని పోలీసులు తెలిపారు.
Also Read: దీపావళికి ముందు PF ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్.. ఇకపై నెలకు రూ.7,500 పెన్షన్..? ఎప్పటినుంచో తెలుసా?