LOC దాటి వస్తాం…పాక్ కు ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్

పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్. అవసరమైతే భారత సైన్యం సరిహద్దు దాటుతుందని అన్నారు. పాకిస్తాన్ వాతావరణాన్ని అణచివేయనింతవరకు నియంత్రణ రేఖ (LOC)పవిత్రమైనదిగా ఉంటదని సర్జికల్ స్ట్రైక్స్ సందేశం పంపినట్లు రావత్ చెప్పారు. ఇకపై హైడ్ అండ్ సీక్ ఉండబోదని, భారతదేశం సరిహద్దును దాటవలసి వస్తే వాయు మార్గం,నేల మార్గం లేదా రెండిటిగుండా పాక్ లోకి ప్రవేశిస్తామని తెలిపారు.
ఎల్ వోసీ దాటి భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. భారత్ ఎన్నిసార్లు చెప్పినా వినకుండా పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతిస్తోందని ఆరోపించారు. భారత్ తో ప్రచ్ఛన్న యుద్ధమే పాక్ పాలసీ అని ఆయన అన్నారు. పాక్ లోని ఉగ్ర క్యాంపులను వారు తరచూ మారుస్తున్నారని తెలిపారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.