పాకిస్తాన్ కండకావరం : సమయం, ప్లేస్ చూసి దాడి చేస్తాం

పాకిస్తాన్ కు ఇంకా బుద్ధి రాలేదు. కండకావరం అస్సలు తగ్గలేదు. భారత వాయుసేన చేతిలో చావుదెబ్బ తిన్నా.. పాకిస్తాన్ లో మాత్రం పశ్చాతాపం లేదు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

  • Published By: veegamteam ,Published On : February 26, 2019 / 11:06 AM IST
పాకిస్తాన్ కండకావరం : సమయం, ప్లేస్ చూసి దాడి చేస్తాం

Updated On : February 26, 2019 / 11:06 AM IST

పాకిస్తాన్ కు ఇంకా బుద్ధి రాలేదు. కండకావరం అస్సలు తగ్గలేదు. భారత వాయుసేన చేతిలో చావుదెబ్బ తిన్నా.. పాకిస్తాన్ లో మాత్రం పశ్చాతాపం లేదు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

పాకిస్తాన్ కు ఇంకా బుద్ధి రాలేదు. కండకావరం అస్సలు తగ్గలేదు. భారత వాయుసేన చేతిలో చావుదెబ్బ తిన్నా.. పాకిస్తాన్ లో మాత్రం పశ్చాతాపం లేదు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి రెచ్చిపోయారు. సమయం, ప్లేస్ చూసి భారత్ పై దాడి చేస్తామని ప్రకటించారు.
Also Read : అర్థరాత్రి యుద్ధం : పాక్ విమానాలు వెంటాడినా.. భారత్ పైటర్లు చిక్కలేదా!

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన జరిపిన మెరుపు దాడులపై ఇమ్రాన్ అధికారులతో చర్చించారు. భద్రతా దళాలు, దేశ ప్రజలు ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. అంతేకాదు సమయం, ప్లేస్ చూసి భారత్ పై దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇమ్రాన్ మాటలను బట్టి ప్రతి దాడికి పాక్ సిద్ధంగా ఉందనే హింట్ ఇచ్చారనే వార్తలు వస్తున్నాయి. భారత వైమానిక దాడులు నిజమే అని పాకిస్తాన్ పార్లమెంటులో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంగీకరించారు. అయితే భారత్ చెబుతున్నట్టు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. కావాలంటే ప్రత్యేక విమానంలో తీసుకెళ్లి దాడి జరిగిన ప్రాంతాలను తాను చూపిస్తానన్నారు.

Also Read :1971 తర్వాత ఇదే : పాక్ లోకి వెళ్లి మరీ.. భారత్ దాడి చేసింది

దాడుల నిజమే అని పాక్ ప్రధాని అంటుంటే.. పాక్ నేషనల్ సెక్యూరిటీ కమిటీ మాత్రం ఖండించింది. ఎలాంటి దాడులు జరగలేదని చెప్పింది. దాడులను భారత మీడియా హైప్ చేసి చూపిస్తోందని మండిపడింది. లేనిది ఉన్నట్లుగా చిత్రీకరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఎలాంటి ప్రాణహాని జరగలేదని పాక్ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇచ్చాక కూడా భారత మీడియా సర్జికల్ స్ట్రైక్ 2 పేరుతో నానా యాగీ చేస్తోందని విమర్శలు చేసింది. భారత మీడియా బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తోందని సీరియస్ అయ్యింది. భారత వైమానిక దళం పాక్ గగనతలంలోకి వచ్చినట్లు తెలియగానే పాక్ ఎయిర్‌ఫోర్స్ స్పందించడంతో భారత యుద్ధ విమానాలు తిరిగి వెళ్లిపోయాయని చెప్పింది. మరోచోట ఫ్యూయల్‌ను డంప్ చేయడంతో అదే బాంబు దాడులని భ్రమించి భారత్ ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తోందని పాక్ నేషనల్ సెక్యూరిటీ కమిటీ అంది. భారత్ కు ఎన్నికల ఏడాది కావడంతో పాకిస్తాన్‌పై దాడులు చేసినట్లు అబద్ధాలు చెబుతున్నారని ఎదురుదాడి చేసింది.

Also Read : బుద్ధిమారదు అంతే : పాకిస్థాన్ కు చిల్లిగవ్వ ఇచ్చేదిలేదు

పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. జవాన్లపై ఉగ్రదాడి(ఫిబ్రవరి 14) జరిగిన 12 రోజులకు భారత వాయుసేన మెరుపు దాడి చేసింది. ఈ తెల్లవారుజామున(ఫిబ్రవరి-26-2019) 3.30గంటలకు పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దళం బాంబుల వర్షం కురిపించింది. జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని, 245మంది టెర్రరిస్టులను మట్టుబెట్టామని భారత వాయుసేన ప్రకటించింది.