భారత్ మాత విజయం… గ్రాండ్ విక్టరీ తర్వాత కేజ్రీవాల్ తొలి పలుకులు

ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టారు. 2015ఎన్నికల్లో 67సీట్లతో గ్రాండ్ విక్టరీ కొట్టిన ఆప్ ఇప్పుడు మరోసారి సీన్ రిపీట్ చేసింది. ఫిబ్రవరి-8,2020న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటికే ఆప్ విజయం ఖారారైంది. ఢిల్లీలో ప్రబుత్వ ఏర్పాటుకు 36మంది ఎమ్మెల్యేలు అవసరం ఉండగా,మొత్తం 70స్థానాల్లో ఆప్ 63స్థానాల్లో లీడింగ్ లో ఉంది.
ఢిల్లీ ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, సీఎం కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు. ముచ్చటగా మూడోసారి ఆమ్ ఆద్మీ పార్టీపై విశ్వాసం ఉంచి గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70స్థానాల్లో 63స్థానాల్లో ఆప్ విజయం దాదాపై ఖారారైంది. అధికారికంగా ఎన్నికల కమిషన్ ప్రకటించడమే తరువాయి. ఈ సమయంలో ఢిల్లీలోని ఆప్ కార్యాలయం వద్ద కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడుతూ…ఢిల్లీ ప్రజలకు హనుమాన్ ఆశీస్సులిచ్చిన రోజు ఇది.
మన అందిరినీ సరైన మార్గంలో నడిపించుకుంటూ మందుకు తీసుకెళ్లాల్సిందిగా ఆ హనుమంతుడిని ప్రార్థిస్తున్నా. రాబోయే ఐదేళ్లు ప్రజాసేవకు పునరంకితమవుతామని అన్నారు. తనను సొంత కుమారుడిగా భావించి ఓటేసిన ప్రతి ఒక్కరికీ ఈ విజయం చెందుతుందని తెలిపారు.తన మద్దతుదారులకు ఐలవ్ యూ అని చెప్పారు. సరికొత్త రాజకీయాలకు ఇది ప్రారంభమని, ఇది కొత్త సంకేతమని అన్నారు. ఆప్‌పై వరుసగా మూడోసారి విశ్వాసం ఉంచి గెలిపించిన ఢిల్లీ ప్రజలకు తన కృతజ్ఞతలని అన్నారు. కామ్ కీ రంజీతీ అంటూ ఆప్ విజయంపై అంతకుముందు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
ఆప్ కార్యకర్తలు ఢిల్లీలో సంబరాలు చేసుకుంటున్నారు. లగేరహో కేజ్రీవాల్ అంటూ డ్యాన్స్ లు వేస్తున్నారు. పలు రాష్ట్రాల సీఎంలు,నాయకులు కేజ్రీవాల్ కు ఫోన్ చేసి అభినందనలు తెలుపుతున్నారు. ఏపీ సీఎం జగన్ కూడా కేజ్రీవాల్ కు అభినందనలు తెలిపారు.