Greater Noida : హౌస్ కీపింగ్ సిబ్బందిపై మహిళ దాడి.. నోయిడాలో వరుసగా ఇలాంటి ఘటనలే..
చెత్తచెదారం కింద పడిందని హౌస్ కీపింగ్ స్టాఫ్‌ని నోటికి వచ్చింది తిట్టింది ఓ మహిళ. అక్కడితో ఆగకుండా చేయి చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గ్రేటర్ నోయిడాలో వరుసగా ఇలాంటివే సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

Greater Noida
Greater Noida : రాను రాను మనుష్యుల్లో సహనం నశిస్తోంది. అనవసరమైన గొడవలకు దిగడమే కాదు అవతలివారిపై చేయి చేసుకునేందుకు కూడా వెనుకాడట్లేదు. గ్రేటర్ నోయిడాలో (Greater Noida) హౌస్ కీపింగ్ సిబ్బందిపై దుర్భాషలాడటమే కాకుండా చేయి చేసుకుంది ఓ మహిళ. పరారీలో ఉన్న మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Thane: రాత్రి కాబట్టి రూ.10 ఎక్కువ అడిగితే ఇవ్వనన్నందుకు ప్రయాణికుడిని చితకబాదిన ఆటోడ్రైవర్
గ్రేటర్ నోయిడా వెస్ట్ లోని నిరాలా ఆస్పైర్ దగ్గర ఉన్న టవర్ ఎ 12వ అంతస్తు లాబీలో ఈ ఘటన జరిగింది. మెయింటెనెన్స్ స్టాఫ్‌గా ఉన్నా మీటూ (Meetu) అనే మహిళ లాబీని శుభ్రం చేస్తోంది. ఆమె చెత్తను సేకరిస్తున్న పాలిథిన్ బ్యాగ్ చినిగిపోయి చెత్తాచెదారం నేలపై పడింది. ఇదంతా చూసిన రాజిందర్ కౌర్ (Rajinder Kaur) అనే మహిళ మెయింటెనెన్స్ సూపర్‌వైజర్‌కు ఫోన్ చేసింది. మరోవైపు మీటూని దుర్భాషలాడటంతో పాటు కాలితో తన్నింది. ఇక మీటూ కళ్లలో దోమల మందు స్ప్రే చేసిందని ఆమె భర్త ఆరోపిస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Teacher Beats Students : మరీ అంత కోపమా? చెప్పులకు బురద అంటిందని విద్యార్థులను చితకబాదిన టీచర్
బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కౌర్ మీద పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. ఆమెను అరెస్టు చేసేందుకు ఇంటికి వెళ్లగా ఆమె కనిపించకుండా పోయింది. ఈ ఘటనలో కౌర్ తప్పు ఉంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. హౌస్ కీపింగ్ సిబ్బందిపై ఇలా దాడికి దిగిన మహిళపై స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నోయిడాలో తరచూ ఇలాంటి ఘటనలో చోటు చేసుకుంటున్నాయి. రీసెంట్ గా క్లియో కౌంటీలో (Cleo County) ఇంటి పనిమనిషిని రెండు నెలలు ఇంట్లో బందీగా ఉంచిన 40 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్టు చేశారు.