Video: ‘హస్బెండ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ ఇవ్వాలి.. కుంభమేళాలో లక్షలాది మంది మధ్య ఈ భర్త చేసిన పనికి..
ఈ వీడియో చూస్తే అందరు పెళ్లికాని అమ్మాయిలు ఇటువంటి భర్త రావాలని నోములు చేస్తారు.

ఇసుకవేస్తే రాలనంత జనం.. భగవన్నామ స్మరణతో మారుమోగిపోతున్న ప్రాంతమంది. అటువంటి కుంభమేళాలో లక్షలాది జనం మధ్య ఓ భర్త తన భార్య కోసం చేసిన పనిని చూసిన వారు ముక్కుమీద వేలు వేసుకుంటున్నారు. ఇంతకీ ఆ భర్త ఏం చేశాడో తెలుసా?
కుంభమేళాలో ఓ మహిళ మేకప్ వేసుకోవాలని భావించింది. మేకప్ వేసుకోవడానికి లిప్‌స్టిక్, క్రీములు, పౌడర్‌లాంటి అన్ని రకాల సామగ్రిని తీసుకొచ్చుకుంది. అంతేకాదు, ఓ చిన్న అద్దం కూడా తెచ్చుకుంది. వాటన్నింటినీ తన భర్తకు ఇచ్చి పట్టుకోమంది.
అంత మంది జనం మధ్య అతి ముఖ్యమైన పని చేస్తున్నట్లు మేకప్ వేసుకుంది. ఆ మహిళ మేకప్ వేసుకుంటుండగా ఆమె భర్త ఓ చేతిలో అద్దం, మరో చేతిలో మేకప్ సామగ్రిని పట్టుకున్నాడు.
ఆ సమయంలో ఒకరు ఈ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఈ దృశ్యాలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ భర్తకు ‘మొగుడు ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ ఇవ్వాలని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఆ భార్య తన భర్తను ఏ రేంజ్‌లో వాడేస్తోందో ఈ వీడియో చూస్తే తెలుస్తుందని కొందరు కామెంట్లు చేశారు.
కుంభమేళాలో అసలు మేకప్ ఎందుకని కొందరు విమర్శలు చేస్తున్నారు. ఆ భర్త చాలా అమాయకుడిలా ఉన్నాడని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇంత మంది ముందు భర్తను ఆమె ఇంతలా వాడేస్తుంటే, ఇక ఇంట్లో ఏ రీతిలో వాడేస్తుందో అర్థం చేసుకోవచ్చని మరో నెటిజన్ అన్నాడు.
View this post on Instagram