అయ్యో పాపం.. తల్లి మృతదేహంతో తొమ్మిది రోజులు ఇంట్లోనే ఇద్దరు కూతుళ్లు.. ఎవరికి చెప్పాలో తెలియక.. చివరికి ఏం చేశారంటే..
తల్లి అనారోగ్యంతో చనిపోయింది.. ఇద్దరు కూతుళ్లకు ఏం చేయాలో తెలియలేదు.. దహన సంస్కారాలకు డబ్బుల్లేవు.. చెప్పుకోవటానికి ఇంటిలో పెద్దదిక్కు ఎవరూ లేరు..

Secunderabad incident
Hyderabad: తల్లి అనారోగ్యంతో చనిపోయింది.. ఇద్దరు కూతుళ్లకు ఏం చేయాలో తెలియలేదు.. దహన సంస్కారాలకు డబ్బుల్లేవు.. చెప్పుకోవటానికి ఇంటిలో పెద్దదిక్కు ఎవరూ లేరు.. ఏం చేయాలో వారికి అర్ధంకాలేదు. దీంతో తొమ్మిది రోజులుగా తల్లి మృతదేహాన్ని ఓ గదిలో ఉంచి ఇద్దరు ఆడ పిల్లలు ఇంట్లోని మరో గదిలో ఉంటూ వచ్చారు. ఆ తొమ్మిదిరోజులు ఇంట్లో ఉన్న బ్రెడ్, ఇతర ఆహారం తింటూ కాలం గడుపుతూ వచ్చారు. మృతదేహం నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి మా అమ్మ చనిపోయింది.. దహన సంస్కారాలకు సహాయం చేయండి అంటూ స్థానికులను వేడుకున్నారు. ఈ విషాద ఘటన సికింద్రాబాద్ లోని వారాసిగూడలో చోటు చేసుకుంది.
Also Read: ధూమ్ సినిమాని మించిపోయారు కదరా.. కార్లు ఈ రేంజ్ లో చోరీ చేయడం మీరెప్పుడూ చూసి ఉండరు..
వారాసిగూడ బౌద్ధనగర్ లోని ఓ బిల్డింగ్ మూడో ఫ్లోర్ లో సీమల శ్రీలలిత (45) తన ఇద్దరు కూతుళ్లు రవళిక, అశ్వితలతో కలిసి రెండేళ్లుగా అద్దెకు ఉంటుంది. ఉస్మానియా యూనివర్శిటీలో ఉద్యోగం చేసే ఆమె భర్త రాజు ఐదేళ్ల క్రితం కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడు. వారి ఆర్థిక పరిస్థితుల కారణంగా రవళిక, అశ్విత టెన్త్ వరకే చదువుకున్నారు. రవళిక ఓ బట్టల దుకాణంలో పనిచేస్తుండగా.. అశ్విత ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీలో క్యాటరింగ్ విభాగంలో పనిచేస్తుంది. శ్రీలలిత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ క్రమంలో జనవరి 22న రాత్రి చనిపోయింది. తల్లి మరణించడంతో ఇద్దరు కుమార్తెలు డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. తల్లి చనిపోయిన విషయాన్ని ఎవరికి చెప్పాలో తెలియక ఇంట్లోని ఓ గదిలో తల్లి మృతదేహాన్ని ఉంచారు. మరో గదిలో వీరు ఉంటూ వచ్చారు. తొమ్మిది రోజులుగా ఇంట్లో తల్లి మృతదేహంతోనే వారు ఉన్నారు. మృతదేహం దుర్వాసన రావడంతో బయటకు వచ్చి స్థానికులకు మా అమ్మ చనిపోయింది.. దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం చేయాలని కోరారు.
స్థానికుల సూచనలతో సీతాఫల్ మండిలోని సికింద్రాబాద్ ఎమ్మెల్యే క్యాప్ కార్యాలయంకు వెళ్లి మా తల్లి దహన సంస్కారాలకు సాయం చేయాలని కోరారు. అక్కడి సిబ్బంది వారాసిగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు బౌద్ధనగర్ లోని శ్రీలలిత నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లి ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. క్లూస్ టీమ్ తో ఇంట్లో పరిశీలించారు. అయితే, మృతురాలి కుటుంబం ఉండేది థర్డ్ ప్లోర్ లో కావడంతో మృతదేహం నుంచి వచ్చే దుర్వాసన కింది వరకు రాకపోయి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.