Jharkhand Showroom Fire: షోరూంలో ఘోర అగ్ని ప్రమాదం.. ఒకరి మృతి.. కాలిపోయిన 300 బైకులు
ఝార్ఖండ్‌లోని పాలము జిల్లాలో ఓ ద్విచక్ర వాహన షోరూంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఓ వృద్ధురాలు (80) ప్రాణాలు కోల్పోయింది. దాదాపు 300 ద్విచక్ర వాహనాలు తగలబడ్డాయి. మెదినీనగర్ పట్టణంలో గత అర్ధ రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు చెప్పారు. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మంటలు ఇవాళ ఉదయం 8.30 గంటలకు అదుపులోకి వచ్చాయని పోలీసులు చెప్పారు. దాదాపు ఐదు ఫైరింజన్లతో మంటలు ఆర్పినట్లు వివరించారు.

Jharkhand Showroom Fire
Jharkhand Showroom Fire: ఝార్ఖండ్‌లోని పాలము జిల్లాలో ఓ ద్విచక్ర వాహన షోరూంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఓ వృద్ధురాలు (80) ప్రాణాలు కోల్పోయింది. దాదాపు 300 ద్విచక్ర వాహనాలు తగలబడ్డాయి. మెదినీనగర్ పట్టణంలో గత అర్ధ రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు చెప్పారు. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మంటలు ఇవాళ ఉదయం 8.30 గంటలకు అదుపులోకి వచ్చాయని పోలీసులు చెప్పారు. దాదాపు ఐదు ఫైరింజన్లతో మంటలు ఆర్పినట్లు వివరించారు.
షోరూంతో పాటు అక్కడే గోడౌన్, సర్వీస్ సెంటర్ ఉందని అన్నారు. ఆ షోరూం యజమాని ఇల్లు కూడా దానికి ఆనుకునే ఉంటుందని చెప్పారు. ఆ ఘటనలో మృతి చెందిన వృద్ధురాలు ఆ షోరూం యజమాని తల్లి అని వివరించారు. మంటల కారణంగా చెలరేగిన పొగ వల్ల ఊపిరాడక ఆమె మృతి చెందినట్లు తెలుస్తోందని అన్నారు. షార్ట్ సర్క్యూటే ఈ అగ్ని ప్రమాదానికి కారణమని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు.
Hyderabad Metro: నేడు అర్ధరాత్రి దాటాక ఒంటి గంట వరకు మెట్రో రైళ్ల సేవలు