రూ.1.5 లక్షల ఐఫోన్‌ను బండరాళ్ల మధ్య పడేసుకున్న యువతి.. ఎలా బయటకు తీశారో చూడండి..

Woman Loses iPhone: రాళ్ల మధ్య పడిపోయిన ఓ ఐఫోన్ ఎక్కడ ఉందో కనుక్కోవడానికి దాన్ని..

రూ.1.5 లక్షల ఐఫోన్‌ను బండరాళ్ల మధ్య పడేసుకున్న యువతి.. ఎలా బయటకు తీశారో చూడండి..

Woman Loses iPhone

Updated On : June 8, 2024 / 6:01 PM IST

ఉద్యోగానికి సెలవు దొరకడంతో హాయిగా కేరళకు విహారయాత్రకు ఓ కర్ణాటక యువతి రూ.1.5 లక్షల విలువైన ఐఫోన్‌ను బండరాళ్ల మధ్య పోగొట్టుకుంది. ఆ యువతి బీచ్‌ వద్ద బండరాళ్లపై నిలుచుని, అలలను ఆస్వాదిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆమె తన ఐఫోన్ ను బండరాళ్ల మధ్య నుంచి తీయడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అవన్నీ విఫలమయ్యాయి. దీంతో తాను ఉంటున్న రిసార్ట్ సిబ్బందికి ఈ విషయం తెలిపింది. దీంతో అక్కడకు వచ్చి రిసార్ట్ సిబ్బంది, కేరళ పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది కలిసి ఆమె పోగొట్టుకున్న ఐఫోన్‌ను బయటకు తీసి ఇచ్చారు.

రాళ్ల మధ్య పడిపోయిన ఓ ఐఫోన్ ఎక్కడ ఉందో కనుక్కోవడానికి నావిగేట్ చేశారు. దాదాపు ఏడు గంటల తర్వాత తప్పిపోయిన ఐఫోన్‌ను వారు బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది.

సిబ్బంది బంరాళ్లపై నిలబడి ఆమె ఫోన్‌ని గుర్తించేందుకు, దాన్ని బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నాలు ఈ వీడియోలో ఉన్నాయి. బండరాళ్ల మధ్యలోకి తాళ్లను వదిలి చివరకు దాన్ని తీయడంతో అందరూ చప్పట్లు కొట్టారు. ఆ ఐఫోన్ ను పోగొట్టుకున్న యువతికి అందించారు.

 

View this post on Instagram

 

A post shared by Antiliya Chalets Chalets (@antiliyachalets)

Also Read: రాబోయే మూడు-నాలుగు నెలల్లో ఏపీ ప్రజలకు తెలుస్తుంది: మాజీ ఎంపీ మార్గాని భరత్