యువకుడితో ఇద్దరు పిల్లల మహిళ వివాహేతర సంబంధం.. ఇంట్లో తెలియడంతో.. హోటల్‌కు తీసుకెళ్లి దారుణం..

ఐటీ ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడితో వివాహమై, ఇద్దరు కుమార్తెలు కలిగిన మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది.

యువకుడితో ఇద్దరు పిల్లల మహిళ వివాహేతర సంబంధం.. ఇంట్లో తెలియడంతో.. హోటల్‌కు తీసుకెళ్లి దారుణం..

Updated On : June 10, 2025 / 8:24 AM IST

Bengaluru: ఐటీ ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడితో వివాహమై, ఇద్దరు కుమార్తెలు కలిగిన మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొన్నాళ్లపాటు ఇద్దరూ గుట్టుగా వారి సంబంధాన్ని కొనసాగించారు. ఈ విషయ మహిళ ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు కౌన్సిలింగ్ సైతం ఇప్పించారు. ఆ తరువాత యువకుడిని కలిసేందుకు మహిళ వెళ్లలేదు. కొన్నాళ్లకు నిన్ను ఒకసారి కలవాలి అంటూ యువకుడు పదేపదే ఫోన్ చేయడంతో ఓ హోటల్ లో కలుసుకునేందుకు ప్లాన్ చేశారు. వారిద్దరూ హోటల్ రూమ్‌కు వెళ్లిన తరువాత దారుణం చోటు చేసుకుంది.

Also Read: ఏపీలో అర్ధరాత్రి దారుణం.. గర్భిణిపై భర్త ఎదుటే మద్యంమత్తులో యువకులు రాళ్లతో దాడి.. ప్రాదేయపడినా వదల్లేదు.. అసలేం జరిగిందంటే..?

పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన హరిణి అనే మహిళకు 2012లో వివాహం జరిగింది. వారికి 13, 10 సంవత్సరాలు కలిగిన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడేళ్ల క్రితం ఓ జాతరలో ఐటీ ఉద్యోగం చేస్తున్న 25ఏళ్ల యువకుడు యాశాస్‌తో హరిణికి పరిచయం ఏర్పడింది. కొద్దిరోజుల తరువాత వారిద్దరి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో వాళ్లు రహస్యంగా కలుస్తూ ఉండేవాళ్లు.

ఈ విషయం హరిణి ఇంట్లోవాళ్లకు తెలియడంతో ఆమెకు కౌన్సెలింగ్ ఇప్పించారు. ఆ తరువాత నుంచి హరిణి యువకుడిని కలవడం, ఫోన్ కాల్స్ ఎత్తడం మానేసింది. అయినప్పటికీ యశాస్ పదేపదే హరిణికి ఫోన్ కాల్స్ చేస్తూ వచ్చాడు. ప్రతీరోజూ ఫోన్ చేస్తుండటంతో హరిణి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్కసారి కలవాలంటూ యశాస్ కోరడంతో చివరిసారి కలిసేందుకు హరిణి అంగీకరించింది. ఈ క్రమంలోనే యశాస్ ఈ నెల6న సాయంత్రం నగరంలోని ఓ హోటల్ కు హరిణిని తీసుకెళ్లాడు.

కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా తాను సంబంధాన్ని కొనసాగించలేనంటూ హరిణి అతనితో స్పష్టం చేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన యశాస్ ఆమెను కొట్టాడు. హరిణి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసి అతని నుంచి తప్పించుకొని వెళ్లేందుకు ప్రయత్నించింది. అప్పటికే తన వెంట కత్తిని తెచ్చుకున్న యశాస్ ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు.

హత్యచేసిన తరువాత హోటల్ గదిలోనే మృతదేహాన్ని వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు రంగంలోకిదిగి నిందితుడిని అరెస్టు చేశారు. అయితే, హోటల్ లో హరిణిని హత్య చేసిన తరువాత యశాస్ తన ఇంటికి వెళ్లి తీవ్రంగా గాయపర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు.