విద్యార్థులకు సెలవుల్లోనూ ఈ హోం వర్కులు ఏంటయ్యా? ఆలోచింపజేస్తున్న మహిళ వీడియో

ఆమె చెప్పింది నూరు పాళ్లు నిజమని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.

విద్యార్థులకు సెలవుల్లోనూ ఈ హోం వర్కులు ఏంటయ్యా? ఆలోచింపజేస్తున్న మహిళ వీడియో

విద్యార్థులకు వేసవి సెలవులు ఇస్తారు. ఆ సమయంలోనయినా చదువులకు, హోం వర్కుకు దూరంగా ఉండొచ్చని అనుకుంటే సెలవుల్లోనూ హోం వర్క్, ప్రాజెక్టులు ఇస్తుంటాయి కొన్ని పాఠశాలలు. అలాగే, ఇతర సెలవుల్లోనూ ఇదే తీరును ప్రదర్శిస్తుంటాయి.

సెలవు రోజుల్లో హాయిగా గడుపుదామన్న సంతోషమే లేకుండా పోతుంది. అంతేగాక, చాలా మంది టీచర్లు విద్యార్థులకు వారికి తగ్గ హోం వర్కులు, ప్రాజెక్టులు కూ ఇవ్వరు. పెద్దల సాయం లేకుండా ఆ హోం వర్కు చేయలేని విధంగా, చాలా కష్టంగా ఉంటాయి.

ఇటువంటి సమస్యనే ఓ తల్లి తాజాగా సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపింది. వీడియో రూపంలో ఆమె మాట్లాడుతూ సెలవుల్లో ఇచ్చే హోమ్‌వర్క్‌ బాధల గురించి మాట్లాడింది. పిల్లలకు ఇచ్చే హాలిడే హోమ్‌వర్క్ అసైన్‌మెంట్‌లపై అసంతృప్తి వ్యక్తం చేసింది. పిల్లలు తమంతట తాముగా చేయలేని ప్రాజెక్ట్‌లను, హోం వర్క్‌లను ఎంత మంది టీచర్లు ఇస్తున్నారని ప్రశ్నించింది.

ప్రతి విద్యార్థి సామర్థ్యానికి తగ్గట్లుగా ప్రాజెక్ట్‌లను ఇవ్వాలని టీచర్లను కోరింది. అలా చేస్తేనే విద్యార్థులు వారి తల్లిదండ్రుల సాయం లేకుండా స్వయంగా హోం వర్క్ చేయగలరని చెప్పింది. ఆమె చెప్పింది నూరు పాళ్లు నిజమని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ప్లీజ్.. ఒక్క నిమిషమైనా పిల్లలను ఆడుకోనివ్వండి అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: అలాంటి వారి సినిమాలకు టికెట్ల ధరలు పెంచే ప్రసక్తే లేదు: రేవంత్ రెడ్డి వార్నింగ్