‘Politicians Are Not Kings’: రాజకీయ నాయకులు దేవుళ్ళు కాదు.. అమిత్ షా, పోలీసులపై మహిళ ఆగ్రహం

సుమారు 300 మంది నివాసితులకు వారి ఇళ్ల తలుపులు, కిటికీలు అన్నింటినీ మూడు గంటలపాటు మూసివేయాలంటూ పోలీసులు ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు విమర్శలకు కారణం అవుతోంది.

‘Politicians Are Not Kings’: రాజకీయ నాయకులు దేవుళ్ళు కాదు.. అమిత్ షా, పోలీసులపై మహిళ ఆగ్రహం

Amith Sha

Updated On : July 13, 2021 / 4:01 PM IST

‘Politicians Are Not Kings’: సుమారు 300 మంది నివాసితులకు వారి ఇళ్ల తలుపులు, కిటికీలు అన్నింటినీ మూడు గంటలపాటు మూసివేయాలంటూ పోలీసులు ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు విమర్శలకు కారణం అవుతోంది. ఈ విషయమై హోంమంత్రి అమిత్‌షా, స్థానిక పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ మహిళ పోలీసులకు లేఖ రాసింది. అంతేకాదు.. ఇదే విషయమౌ ఫేస్‌బుక్‌లోనూ ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ చేసింది.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అహ్మదాబాద్‌ రెండు రోజుల పర్యటన సందర్భంగా అహ్మదాబాద్‌‌లోని వెజల్పూర్ పోలీస్ స్టేషన్ జారీ చేసిన పోలీసు సర్క్యులర్ ప్రకారం, “గౌరవనీయమైన భారత హోంమంత్రి శ్రీ అమిత్ షా ఆదివారం ఒక కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవానికి ఈ ప్రాంతానికి వస్తున్నారు. Zకేటగిరీ భద్రతకు సంబంధించి, అమిత్ షా గారి భద్రత ముఖ్యం కాబట్టి జూలై 11, 2021 ఆదివారం, దయచేసి మీ అపార్టుమెంట్లు, గృహాల తలుపులు మరియు కిటికీలన్నింటినీ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు మూసివేయండి. షాపులను కూడా మూసివేయండి” అంటూ సర్క్యులర్‌ను వెజల్‌పూర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ ఎల్‌డి ఒడెడారా జారీ చేశారు.

పోలీసులు ఐదు అపార్టుమెంటులైన స్వామినారాయణ పార్క్ సొసైటీ, స్వాతి అపార్టుమెంటులు మరియు ఇతర ఇండిపెండెంట్ ఇళ్లకు నోటీసులను అంటించి తప్పనిసరిగా పాటించాలని మైకులో అనౌన్స్‌ చేశారు. అయితే, పది జాతీయ భద్రతా కమాండోలతో సహా 55 మంది సిబ్బందితో కూడిన అమిత్ షా భద్రతా బృందం నుండి అలాంటి సూచనలు లేవని వైబ్స్ ఆఫ్ ఇండియా ధృవీకరించింది.

అయితే, ఈ విషయంలో పోలీసులు అత్యత్సాహం ప్రదర్శించారంటూ.. పంక్తి జోగ్‌(44) అనే ఇదే విషయమై ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉందని, కిటికీలు తెరిచే ఉంచుతానని తనలాంటి వాళ్లు ఎందరో మీ ఆదేశాలతో ఇబ్బందులు పడతారని, కాబట్టి ఆ సర్క్యులర్‌ను వెనక్కి తీసుకోవాల్సిందిగా పోలీసులను హెచ్చరించింది. ‘మనం ప్రజాస్వామ్య బద్ధమైన దేశంలోనే లేమా? అమిత్ షా కూడా మంత్రి, మనిషే కదా? రాజకీయ నాయకులు రాజులు కాదు కదా? దేవుళ్లైతే అస్సలు కాదు కదా? ఇంత అతి చేస్తున్నారు ఎందుకు అని పోలీసులను ప్రశ్నించింది. జనాలు ఓట్లేస్తే గెలిచిన మంత్రి.. జనాలను ఇబ్బంది పెట్టడం ఏంటి? అంటూ నిలదీశింది.