Delhi : 3 ఏళ్లుగా తన ప్లాట్ లో 14 వీధి కుక్కలను నిర్బంధించిన మహిళ.. దయనీయమైన పరిస్థితిలో ఉన్నవాటిని కాపాడిన పోలీసులు

డాగ్స్ పెంచుకోవడం చాలామందికి ఇష్టం. వీధి కుక్కల్ని చేరదీసే వారు ఉన్నారు. అయితే ఏకంగా 14 వీధి కుక్కల్ని 3 ఏళ్లుగా తన ప్లాట్‌లో నిర్బంధించింది ఓ మహిళ. వాటికి సరైన ఆహారం, సంరక్షణ లేకపోవడంతో వాటి పరిస్థితి దయనీయంగా మారింది.

Delhi : 3 ఏళ్లుగా తన ప్లాట్ లో 14 వీధి కుక్కలను నిర్బంధించిన మహిళ.. దయనీయమైన పరిస్థితిలో ఉన్నవాటిని కాపాడిన పోలీసులు

Delhi

Delhi : 14 వీధి కుక్కలు.. మూడేళ్లుగా వాటికి సరైన ఫుడ్ లేదు. సంరక్షణ లేదు. ఓ మహిళ వాటిని నిర్బంధించి తన ప్లాట్‌లో పెంచుకుంటోంది. ప్లాట్ పరిసరాలు దుర్వాసన రావడంతో స్ధానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Sreet Dogs properties : కోట్లకు పడగలెత్తిన వీధికుక్కలు .. ఆ గ్రామంలో కుక్కలకు కోట్ల విలువ చేసే ఆస్తులు

ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో ఓ ఇంటి నుంచి 14 వీధి కుక్కలను పోలీసులు రక్షించారు. మూడు సంవత్సరాలుగా వాటిని ఓ మహిళ తన ప్లాట్‌లో పెంచుతోంది. అయితే వాటికి ఆహారం, సంరక్షణ లేకపోవడంతో అపార్ట్‌మెంట్ మొత్తం వాటి మల,మూత్రాలతో నిండిపోయింది. ఆమె ప్లాట్ పరిసరాలు దుర్వాసన వెదజల్లుతుండటంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Gaushala Dead Cows : యూపీ గోశాలలో ఆవుల మృతి..కుక్కలు పీక్కుతింటున్న వీడియో వైరల్

కుక్కలను చికిత్స కోసం SPCA-MCD బృందాలకు అప్పగించమని చెప్పినా ఆ మహిళ సహకరించలేదని పోలీసులు చెప్పారు. ఇక వాటిని రక్షించేందుకు సెర్చ్ వారెంట్‌తో వచ్చిన పోలీసులు వాటిని రక్షించి చికిత్స కోసం ఢిల్లీలోని వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. రెస్క్యూ సమయంలో 14 కుక్కలు దయనీయమైన పరిస్థితులో ఉన్నట్లు తెలుస్తోంది.