woman constable gender change : మహిళా కానిస్టేబుల్ లింగ మార్పిడికి హోంశాఖ అనుమతి..సర్జరీ తరువాత ఉద్యోగం చేయొచ్చు..

మధ్యప్రదేశ్ లో ఓ మహిళా కానిస్టేబుల్. మగవాడిగా మారాలనుకుంది. దాని కోసం దరఖాస్తు చేసుకుంది. లింగమార్పిడికి హోం శాఖ అనుమతి ఇచ్చిది. ఇది మధ్యప్రదేశ్ లో తొలి కేసు కావటం విశేషం.

woman constable gender change : మహిళా కానిస్టేబుల్ లింగ మార్పిడికి హోంశాఖ అనుమతి..సర్జరీ తరువాత ఉద్యోగం చేయొచ్చు..

Woman Constable Gender Change

Updated On : December 1, 2021 / 4:51 PM IST

woman constable gender change :  మహిళాగా పుట్టి మగవాడిగా మారాలనుకుంది ఓ కానిస్టేబుల్. దాని కోసం ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకుంది. దీనిని పరిశీలించిన హోం శాఖ ఆమెకు అనుకూలంగా అనుమతులిచ్చింది. లింగ మార్పిడి కోసం అనుమతిని ఇచ్చింది. మధ్యప్రదేశ్ హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయంతో ఆమె లింగ మార్పిడి చేయించుకుని మహిళ కాస్తా మగవాడిగా మారనుంది. ఇలా లింగ మార్పిడికి అనుమతి ఇవ్వటంతో మధ్యప్రదేశల్ లో ఇదే తొలిసారి.

దీనిపై రాష్ట్ర హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి రాజేష్ రాజౌరా మాట్లాడుతు..మధ్యప్రదేశ్ లో లింగ మార్పిడి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఇదే తొలి కేసు అని తెలిపారు. దానికి సంబంధించి ఉత్తర్వులు హోం శాఖ బుధవారం (డిసెంబర్ 1,2021) రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపామని తెలిపారు.లింగమార్పిడి తరువాత కూడా ఆమె (అతడుగా మారాక) కూడా కానిస్టేబుల్ గా ఉద్యోగంలో కొనసాగేందుకు హోంశాఖ అంగీకరించింది.

2019లో గెజిట్ ఆఫ్ ఇండియాలో ఉన్న నోటిఫికేషన్ ఆధారంగా ఆఫిడవిట్ సమర్పిస్తూ సదరు మహిళా కానిస్టేబుల్ దరఖాస్తు చేసుకుంది. దీనిపై రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి సమీక్ష తర్వాత కీలక నిర్ణయం తీసుకుని అనుమతి ఇచ్చిందని డీజీపీ కార్యాలయం తెలిపింది. మహిళా కానిస్టేబుల్ అమిత లేక ఆశా పేరు ఏదైనా కావచ్చు కానీ పేరు వెల్లడించకూడదు. సదరు మహిళా కానిస్టేబుల్ తన జెండర్ మార్చుకునేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు అనుమతి ఇచ్చారు.

Read more : లింగ మార్పిడి చేయించుకుని యువతిని పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్

మహారాష్ట్రలో కూడా తొలి సారి అనుమతి..
ఐదు సంవత్సరాల క్రితం.. బీడ్ కు చెందిన 29 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ తన జెండర్ ను మార్చుకోవడానికి అనుమతి కోరింది. దేశంలో ఇదే తొలి కేసు. అన్ని చట్టపరమైన అడ్డంకులను తొలగించిన తర్వాత ఆమెకు లింగ మార్పిడి సాధ్యమైంది. ఈ చట్టపరమైన ప్రక్రియకు అతనికి రెండు మూడేళ్ల పట్టింది. లింగమార్పిడికి అనుమతించాలంటూ ఆ మహిళా కానిస్టేబుల్ చేసుకున్న అభ్యర్థనను మొదట మహారాష్ట్ర పోలీసులు తిరస్కరించారు. దీంతో ఆమె ఔరంగాబాద్ ఐజీపీ రాజ్ కుమార్ వాట్కర్ తన విషయం వివరిస్తు లేఖ రాశారు. ఆ తర్వాత హైకోర్టు అనుమతితో ఆమె అభ్యర్థనను మహారాష్ట్ర హోంమంత్రిత్వశాఖ అంగీకరించింది.

Read more : International Flights : అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

కాగా సదరు మహిళా కానిస్టేబుల్కు చిన్నప్పటినుంచి Gender identity disorder సమస్య ఉంది. జాతీయ స్థాయి సైకియాట్రిస్టులు కూడా దీనిని ధ్రువీకరించారు. పోలీసు హెడ్ క్వార్డర్స్ అనుమతి కోసం హోంశాఖ నుంచి గైడెన్స్ తీసుకుంది. దీనిపై డాక్టర్ రాజూరా మాట్లాడుతూ.. దేశంలో ఏ పౌరుడైన తన మతం, కులంతో సంబంధం లేకుండా తన జెండర్ ను ఎంచుకునే స్వేచ్ఛ ఉందని అన్నారు. ఇందులో భాగంగా లా డిపార్ట్మెంట్ ను సంప్రదించి.. హోం శాఖ తరఫున పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు అనుమతి లభించిందని తెలిపారు.