Reena Dwivedi Viral Pic : అప్పుడు పసుపు రంగు చీర…ఇప్పుడు బ్లాక్ స్లీవ్ లెస్ టీ షర్టుతో తళుక్కుమన్న రీనా ద్వివేది..
2019 యూపీ ఎన్నికల్లో పసుపురంగు చీరలో ఎంట్రీ ఇచ్చి మోస్ట్ వైరల్ అయిన ఎన్నికల అధికారణి రీనా ద్వివేదీ తాజాగా యూపీ ఎన్నికల్లో మోడ్రన్ లుక్ తో ఎంట్రీ ఇచ్చారు.బ్లాక్ స్లీవ్ లెస్ టీషర్టు

Up Elections Officer Reena Dwivedi Crazy Separation
UP Elections Officer Reena Dwivedi Crazy Separation: ఎన్నికల ప్రచారమే కాదు ఎన్నికలు జరిగే సమయం కూడా టెన్షన్ టెన్షన్ గా ఉంటుంది. గెలుపు కోసం పడే పోటీలో ప్రచారంచేసి చేసి అలిసిపోయిన నేతలు పోలింగ్ రోజున మరింత టెన్షన్ పడుతుంటారు. ఓట్లు ఎవరికి పడతాయా?అని దీంతో పోలింగ్ వాతావరణం అంతా హీట్ హీట్ గా ఉంటుంది. అలాగే ఉంది యూపీలోని లక్నోలో కూడా. మరింత వేడి వేడిగా వాతారణం ఫుల్ హడావిడిగా ఉంది.
నేతల హడావుడి, ఆయా పార్టీల కార్యకర్తల అత్యుత్సాహాలు, మద్యం బిర్యానీలు పంచటాలు, అలాగే చాటు మాటుగా డబ్బులు పంచటాలు వంటివి యదేచ్చగా జరిగిపోతుంటాయి ఎన్నికల కమిషన్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ. ఓట్లు వేయటానికి వచ్చిన జనాలతో పోలింగ్ కేంద్రాలు హడావిడి హడావిడాగా ఉన్నాయి. మరోపక్క పోలీసుల పహారా..ఈ హడావిడిలో అంతటి హీటెక్కిన వాతావరణంలో ఓ మెరుపు తీగ తళుక్కుమంది.
ఆమెను చూస్తే అందరు కళ్లార్పకుండా చూస్తుండిపోవాల్సిందే. ఎందుకంటే సినీ తారల గ్లామర్ కు ఏమాత్రం తక్కువ కాదు ఆమె.ఇంతకీ ఎవరామె ‘రీనా ద్వివేది’. ఎన్నికల అధికారిణి ‘రీనా ద్వివేది’ ఎంట్రీ ఇచ్చారు. గత ఎన్నికల్లో అంటే.. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రీనా ద్వివేది పసుపు రంగు చీరలో ఎంట్రీ ఇచ్చి అందరిని మెస్మరైజ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఫుల్ మోడ్రన్ గా ఎంట్రీ ఇచ్చారు. బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ టీ షర్టు, లైట్ కలర్ ప్యాంట్ లూజ్ హెయిర్ తో ఫోన్ లో స్టైల్ గా మాట్లాడుతు పోలింగ్ బూత్ వద్దకు ఎంట్రీ ఇచ్చారు. దటీజ్ రీనా ద్వివేది స్టైల్. అంతే అందరు ఆమెకేసే చూడటం..రీనా ద్వివేదీ క్రేజ్ అంటే అది.. మామూలుగా ఉండదుమరి..
తాగా బ్లాక్ కలర్ టీ షర్టులో ఎంట్రీ ఇచ్చిన ఈ ఎన్నికల అధికారిణి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఆమె రాత్రికి రాత్రే నెట్టింట సెన్సెషన్‌గా మారారు. పసుపు రంగు చీర కట్టుకున్న ఈ మహిళా పోలింగ్ అధికారి ఫొటో అప్పట్లో సూపర్ సెన్సెషనల్‌గా మారింది.తాజాగా.. రీనా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారారు పోలింగ్ ఆఫీసర్ రీనా ద్వివేదీ.. ప్రస్తుతం ఆమె యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో రీనాకు సంబంధించిన ట్రెండీ లుక్ సోషల్ మీడియాలో మళ్లీ వైరల్‌గా మారింది. ఈసారి ఆమె స్లీవ్‌లెస్ బ్లాక్ టాప్, లేత గోధుమరంగు ప్యాంటుతో రీనా ట్రెండీ లుక్‌లో దర్శనమిచ్చారు.
ఎలక్టోరల్ పోలింగ్ ఆఫీసర్ అయిన రీనా ద్వివేది 2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో కూడా ఇంటర్నెట్ సంచలనంగా మారారు. ఆ తర్వాత 2019లో మరోసారి పసుపు చీర కట్టుకుని ఉత్తరప్రదేశ్‌లోని పోలింగ్ సైట్‌లో కనిపించారు. అయితే.. ఈ సారి ఎన్నికల్లో రీనా ద్వివేది మళ్లీ అద్భుతమైన లుక్‌తో దర్శనమిచ్చారు. తాజాగా.. ఆమెకు సంబంధించిన ఫోటోలు మరోసారి వైరల్ అవుతున్నాయి. యూపీలో నాలుగో దశ ఎన్నికలకు ముందు ఆమె మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. పోలింగ్ కేంద్రం వద్ద అందరి కళ్లు ఆమెవైపే ఉన్నాయి.
లక్నోలోని గోసాయిగంజ్ బూత్ నంబర్ 114లోని బస్తియాలోని పోలింగ్ స్టేషన్‌కు రీనా ద్వివేదీ విధులకు వచ్చినప్పుడు తీసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. న్యూ లుక్ త లుక్‌లో ఎంట్రీ ఇచ్చిన రీనాను మీడియా వదులుతుందా చెప్పండి. అదే జరిగింది. గతంలో కంటే ఆమె గ్లామర్ లో ఏమాత్రం తేడా లేదు సరికదా..ఈ సారి మరింత అందంగా ఆకర్షణీయంగా ఉన్నారామె. ఆమెతో మీడియా చిట్ చాట్ చేసింది. మీ మార్పుకు కారణమేంటీ మాడమ్ అంటూ..దానికి రీనా ద్వివేదీ కూడా చాలా చక్కగా సమాధానమిచ్చారు. “తోడా చేంజ్ హోనా చాహియేనా (కొంచెం మార్పు అవసరం)’’.. అంటూ ఆమె సరదాగా తెలిపారు.
ఈ న్యూ లుక్ ఎంట్రీ సందర్భంగా రీనా మాట్లాడుతూ.. ‘‘ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నానని ఓటర్లు అందరు తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. అలాగే తన లుక్ గురించి మాట్లాడుతూ..నేను ఫ్యాషన్ ట్రెండ్స్‌ని ఫాలో అవుతా.. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండటానికి ఇష్టపడతా..దానికి నిదర్శనమే ఇదిగో నా ట్రెండ్లీ లుక్ అంటూ నవ్వుతూ తెలిపారు రీనా..దటీజ్ రీనా ద్వివేదీ..అనేలా ఉంది కదూ..ఆమె స్టైల్ అండ్ సమాధానం..