బాలాకోట్ దాడులపై యోగి సంచలన వ్యాఖ్యలు

బాలాకోట్ ఉగ్రశిబిరాలపై వాయుసేన మెరుపుదాడులు కేంద్రంలో మరోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగపడతాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Published By: venkaiahnaidu ,Published On : March 12, 2019 / 01:00 PM IST
బాలాకోట్ దాడులపై యోగి సంచలన వ్యాఖ్యలు

బాలాకోట్ ఉగ్రశిబిరాలపై వాయుసేన మెరుపుదాడులు కేంద్రంలో మరోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగపడతాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బాలాకోట్ ఉగ్రశిబిరాలపై వాయుసేన మెరుపుదాడులు కేంద్రంలో మరోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగపడతాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలాకోట్ మెరుపుదాడులను బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సమయంలో యోగి తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్ లోని ఉగ్రశిబిరాలపై మెరుపుదాడులకు సంబంధించి మోడీ సర్కార్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని, ఈ నిర్ణయం.. మోడీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఉపయోగపడుతుందని యోగి ట్వీట్ చేశారు.
Read Also : రాఫెల్ డీల్‌పై రాహుల్ ఎటాక్ : అంబానీ ‘పేపర్ ప్లేన్’ కూడా చేయలేడు

యూపీలోని మొత్తం 80 ఎంపీ స్థానాల్లో 74 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని తెలిపారు. వాయుసేన మెరుపుదాడులపై సందేహాలు లేవనెత్తుతూ సైనికుల ఆత్మస్థైర్యాలను దెబ్బతీసేలా విపక్షాలు వ్యవహరించాయని అన్నారు. ఇంతకుముందు కూడా కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాల బీజేపీ చీఫ్ లు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వాయుసేన మెరుపుదాడులతో  మోడీ ఇమేజ్ పెరిగిపోయిందని, కర్ణాటకలో అత్యధిక ఎంపీ స్థానాలను బీజేపీ గెల్చుకుంటుందని కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వాయుసేన మెరుపుదాడులతో రానున్న ఎన్నికల్లో తమ పార్టీ రాష్ట్రంలోని 14 స్థానాల్లో విజయం సాధిస్తుందని జార్ఖండ్ బీజేపీ చీఫ్ లక్షణ్ గిలువా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.