Bans Halal Certified Food : హలాల్ సర్టిఫికేషన్లపై యోగి సర్కారు నిషేధాస్త్రం

హలాల్ విషయంలో ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శనివారం హలాల్ ట్యాగ్ ఉన్న ఉత్పత్తులను నిషేధించింది. హలాల్ సర్టిఫికేషన్‌తో కూడిన ఆహార ఉత్పత్తుల ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, విక్రయాలను తక్షణమే నిషేధిస్తున్నట్లు యోగి సర్కారు తెలిపింది....

Bans Halal Certified Food : హలాల్ సర్టిఫికేషన్లపై యోగి సర్కారు నిషేధాస్త్రం

Yogi bans Halal certification

Updated On : November 19, 2023 / 10:28 AM IST

Bans Halal Certified Food : హలాల్ విషయంలో ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శనివారం హలాల్ ట్యాగ్ ఉన్న ఉత్పత్తులను నిషేధించింది. హలాల్ సర్టిఫికేషన్‌తో కూడిన ఆహార ఉత్పత్తుల ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, విక్రయాలను తక్షణమే నిషేధిస్తున్నట్లు యోగి సర్కారు తెలిపింది. అయితే ఎగుమతి కోసం తయారు చేసిన ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తించదు.

కఠిన చట్టపరమైన చర్యలు 

‘‘ఉత్తరప్రదేశ్‌లో హలాల్ ధృవీకృత మందులు, వైద్య పరికరాలు, సౌందర్య సాధనాల ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, కొనుగోలు, అమ్మకంలో నిమగ్నమై ఉన్న ఏ వ్యక్తి లేదా సంస్థపైనా కఠినమైన చట్టపరమైన చర్యలు అమలు చేస్తాం’’ అని యోగి ఆదిత్యనాద్ నేతృత్వంలోని ప్రభుత్వ అధికారిక ఉత్తర్వు పేర్కొంది.ఆహార ఉత్పత్తుల యొక్క హలాల్ ధృవీకరణ అనేది ఒక సమాంతర వ్యవస్థ. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940 దాని సంబంధిత నియమాలలో హలాల్ ధృవీకరణ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు.

ALSO READ : Barrelakka Sirisha : కొల్లాపూర్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బర్రెలక్క

నకిలీ హలాల్ సర్టిఫికేట్‌లను అందించడం ద్వారా అమ్మకాలను పెంచడానికి ప్రజల మతపరమైన మనోభావాలను వినియోగించుకున్నారని ఆరోపిస్తూ ఒక కంపెనీ,మరికొన్ని సంస్థలపై పోలీసు కేసు నమోదు చేసిన తర్వాత ఈ చర్య తీసుకున్నారు. హలాల్ సర్టిఫికెట్లు అందించడం ద్వారా అమ్మకాలను పెంచడానికి మతపరమైన మనోభావాలను ఉపయోగించుకున్నందుకు చెన్నై హలాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ , ఢిల్లీ జమియత్ ఉలమా-ఇ-హింద్ హలాల్ ట్రస్ట్ , ముంబయి హలాల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర జమియత్ ఉలమా తదితర సంస్థలపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు.

ALSO READ : ICC World Cup 2023 : ఐసీసీ ప్రపంచ కప్ విజేతకు కనకవర్షమే

హలాల్ సర్టిఫికేట్ లేని కంపెనీల ఉత్పత్తుల విక్రయాలను తగ్గించే ప్రయత్నాలను సూచిస్తూ, కుట్ర జరిగిందని ఫిర్యాదుదారు ఆందోళన వ్యక్తం చేశారు.పాల ఉత్పత్తులు, షుగర్ బేకరీ ఉత్పత్తులు, పిప్పరమెంటు నూనె,రెడీ-టు-ఈట్ సావరీస్, ఎడిబుల్ ఆయిల్స్ వంటి కొన్ని ఆహార ఉత్పత్తుల లేబుల్‌లపై హలాల్ సర్టిఫికేషన్ ఉందని ఫుడ్ కమిషనర్ కార్యాలయం తెలిపింది. హలాల్ ధృవీకరణ అనేది ఇస్లామిక్ చట్టానికి అనుగుణంగా ఆహారం తయారు చేసిందని, కల్తీ లేనిదని హామీ ఇస్తుంది.