లాస్ట్ బట్ నాట్ లీస్ట్: అమిత్ షాకు కౌంటర్ ఇచ్చిన రజనీకాంత్

దేశం మొత్తానికి ఒకే భాష అనేది భారతదేశానికే కాదు ఏ దేశానికైనా మంచిదే. ఇది అభివృద్ధికి ఐక్యతకు దోహదపడుతుంది. దురదృష్టవశాత్తు ఒకే భాష అనేది ఒక వ్యక్తి చెప్తే రాదు. అందుకని ఏ భాషను మాపై రుద్దకండి.

లాస్ట్ బట్ నాట్ లీస్ట్: అమిత్ షాకు కౌంటర్ ఇచ్చిన రజనీకాంత్

Updated On : September 18, 2019 / 9:14 AM IST

దేశం మొత్తానికి ఒకే భాష అనేది భారతదేశానికే కాదు ఏ దేశానికైనా మంచిదే. ఇది అభివృద్ధికి ఐక్యతకు దోహదపడుతుంది. దురదృష్టవశాత్తు ఒకే భాష అనేది ఒక వ్యక్తి చెప్తే రాదు. అందుకని ఏ భాషను మాపై రుద్దకండి.

దేశం మొత్తానికి ఒకే భాష ఉండాలంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై రజనీకాంత్ స్పందించారు. ‘దేశం మొత్తానికి ఒకే భాష అనేది భారతదేశానికే కాదు ఏ దేశానికైనా మంచిదే. ఇది అభివృద్ధికి ఐక్యతకు దోహదపడుతుంది. దురదృష్టవశాత్తు ఒకే భాష అనేది ఒక వ్యక్తి చెప్తే రాదు. అందుకని ఏ భాషను మాపై రుద్దకండి’ అని రజనీకాంత్ వ్యాఖ్యానించారు.  

‘ప్రత్యేకంగా హిందీని రుద్దాలనుకుంటే తమిళనాడు మాత్రమే కాదు ఏ దక్షిణాది రాష్ట్రం దీనికి ఒప్పుకోదు. అంతేకాదు కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు కూడా దీనికి వ్యతిరేకత వ్యక్తం చేస్తాయి’ అని చెన్నై ఎయిర్‌పోర్ట్ దగ్గర మీడియా మిత్రులతో తమిళంలో మాట్లాడారు రజనీకాంత్. 

కొద్ది రోజుల ముందు శనివారం అమిత్ షా హిందీ భాషా దినోత్సవం సందర్భంగా తన అధికారిక ట్విట్టర్ ద్వారా ఇలా ట్వీట్ చేశారు. ‘భారత్ లాంటి దేశంలో విభిన్నమైన భాషలు ఉన్నాయి. ప్రతి భాషకు ఒక ప్రత్యేకత ఉంది. కానీ, అందరికీ ఒకే భాష అనేది తప్పక ఉండాలి. అప్పుడే విశ్వవ్యాప్తంగా భారత్‌కు గుర్తింపు వస్తుంది. ఒకభాషే ఉంటే అందరిలో ఐకమత్యం అలవడుతుంది. అదీ హిందీ భాషే అయి ఉండాలి. ఎందుకంటే భారత్ మొత్తంలో చాలా మంది ఈ భాషనే అర్థం చేసుకోగలరు’ అని ట్వీట్ చేశాడు. 

ఈ ట్వీట్ పై పలువురి నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. తమిళ నటుడు కమల్ హాసన్, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లు వ్యతిరేకించారు.