Suicide : కాబోయే భర్త వేధింపులకు యువతి మృతి
పెళ్లికి ముందే ఓ యువతికి నూరేళ్లు నిండాయి. కాబోయే భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రము హుబ్లీలో చోటుచేసుకుంది.

New Project (2)
Suicide : పెళ్లికి ముందే ఓ యువతికి నూరేళ్లు నిండాయి. కాబోయే భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రము హుబ్లీలో చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళితే.. ప్రశాంత నగర ప్రాంతానికి చెందిన పవిత్ర పాటిల్‌కు అబినందన్ అనే యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. డిసెంబర్ 2న పెద్దలు పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు.
చదవండి : Suicide : పండుగకు వస్తానన్న కొడుకు రాలేదనే మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
ఇటీవల ఇద్దరు కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం దండేలికి వెళ్లారు. ఫోటో షూట్ అనంతరం ఎవరింటికి వారు వెళ్లిపోయారు. ప్రీ వెడ్డింగ్ షూట్‌కి వెళ్లివచ్చిన నాటి నుంచి అబినందన్ ప్రవర్తనలో మార్పు కనపడిందని.. తరుచు ఫోన్ చేసి తమ కూతురిని వేధించేవాడని.. అతడి వేధింపులు తాళలేక తమ కూతురు శుక్రవారం ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అశోక్ నగర పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
చదవండి : Suicide : పెళ్లైన ఆరు నెలలకే ఉరివేసుకొని భార్యాభర్తల ఆత్మహత్య