ప్రేమించింది, అతడితో తిరిగింది, పెళ్లికి మాత్రం నో అంది.. ప్రియురాలు మోసం చేసిందని ప్రియుడు ఆత్మహత్య

ప్రియుడు మోసం చేశాడని ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు అనేకం. ప్రేమ పేరుతో వంచనకు గురైన అమ్మాయిలు ఎందరో. కానీ, అబ్బాయిలే కాదు ప్రేమ పేరుతో మోసం చేసేవాళ్లలో అమ్మాయిలు కూడా ఉన్నారని తేలింది. ప్రేమించిన యువతి మోసం చేసిందనే బాధతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఈ ఘటన జరిగింది.
ఆ యువకుడి పేరు రోహిత్. ఆగ్రాలో నివాసం ఉంటాడు. అదే పట్టణానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. కొన్నాళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. రోహిత్ డిగ్రీ పూర్తి చేశాడు. అమ్మాయి ఢిల్లీలో బీటెక్ చదువుతోంది. ప్రేమ పేరుతో ఇద్దరూ కలిసి తిరిగారు. సన్నిహితంగా మెలిగారు. పెళ్లి చేసుకుందామని ఓ రోజు రోహిత్ అడిగాడు. పెళ్లికి ఆ యువతి నో చెప్పింది. తన ఇంట్లో పెళ్లికి పెద్దలు ఒప్పుకోరంది. అంతేకాదు ఇంతటితో డ్రాప్ అవుదామని రోహిత్ తో తేల్చి చెప్పింది. దీంతో రోహిత్ తీవ్ర మనస్తాపానికి గురయ్యడు. తాను మోసపోయాను అనే బాధతో ఇంట్లో ఫ్యాన్ కి ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.
బుద్ధిగా చదువుకునే తమ పిల్లాడిని ఆ యువతి ప్రేమ పేరుతో తన మాయలో పడేసిందని రోహిత్ తల్లిదండ్రులు ఆరోపించారు. చివరకు పెళ్లి విషయం వచ్చేసరికి తమ ఇంట్లో పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని చెప్పి రోహిత్ ను అమ్మాయి మోసం చేసిందన్నారు. ఆ అమ్మాయి అలా చెప్పడంతో కొద్దిరోజులుగా రోహిత్ మనోవేదనకు గురయ్యాడని, తీవ్ర మనస్తాంతో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యా. ఈ విషయం తెలిసిన రోహిత్ స్నేహితులు కూడా షాక్ తిన్నారు. ప్రేమ పేరుతో రోహిత్ ని మోసం చేసిన యువతిని కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ డిమాండ్ చేశారు.