ఉద్యోగాలు అడిగితే చందమామను చూపిస్తుందీ ప్రభుత్వం: రాహుల్ గాంధీ

ఉద్యోగాలు అడిగితే చందమామను చూపిస్తుందీ ప్రభుత్వం: రాహుల్ గాంధీ

Updated On : October 13, 2019 / 11:22 AM IST

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని లాతూర్ వేదికగా భారతీయ జనతాపార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆదివారం జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన నిరుద్యోగంపై మాట్లాడారు. ఎప్పుడైనా యూత్ ఉద్యోగాల గురించి అడిగితే ప్రభుత్వం చందమామను చూపిస్తుందన్నారు. 

ఇటీవల ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 మిషన్‌‌పై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. యువత ఉద్యోగాలు అడిగినప్పుడు చందమామను చూపిస్తుందీ ప్రభుత్వం. ఇది మీడియా పనితనమే. ప్రదాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా పలు విషయాలు చూపించి ప్రజల దృష్టి మరలుస్తున్నారు’ అని రాహుల్ గాంధీ తెలిపారు. 

2017లో చైనా ఆక్రమితదారులు భారత్‌లోకి చొచ్చుకుని వచ్చిన సంగతి గుర్తు చేశారు. అక్టోబరు 11, 12 తేదీల్లో చైనా అధ్యక్షుడి పర్యటనను గుర్తుచేస్తూ మోడీ భారత్‌ను మేక్ ఇన్ ఇండియా కాదు మేక్ ఇన్ చైనా చేస్తారంటూ విమర్శించారు. ప్రభుత్వం ఎప్పుడూ ఆర్టికల్ 370, చంద్రయాన్ 2 విషయాలపై మాత్రమే ప్రచారం చేస్తుంది. మిగిలిన విషయాలను పక్కన పెట్టేస్తుంది. 

డీమోనిటైజేషన్ గురించి మాట్లాడుతూ.. డీమోనిటైజేషన్ ప్రతి ఒక్కరికీ లాభం చేకూర్చకపోతే.. ఉరితీయమని ప్రధాని మోడీ చెప్పారు. కానీ, దీని వల్ల ఎవరు లాభం పొందారని రాహుల్ ప్రశ్నించారు. చంద్రయాన్-2మిషన్ గురించి మాట్లాడుతూ.. చంద్రుడిపైకి రాకెట్ పంపితే మహారాష్ట్రలో ఉన్న వారి కడుపు నిండదు’ అని ప్రసంగించారు.