70 Year Old Woman Birth Twins : 70 ఏళ్ల వయస్సులో కవలలకు జన్మనిచ్చిన మహిళ
70 ఏళ్ల వయస్సులో కవల పిల్లలకు జన్మనిచ్చింది ఓ మహిళ. తల్లికావాలనే తన కలను 70ఏళ్ల వయస్సులో నెరవేర్చుకుంది.

70 Year Old Woman Birth Twins
70 Year Old Woman Twins Gives Birth : సాధారణంగా మహిళలకు 45 ఏళ్లు దాటితే పిల్లలు పుట్టటం కష్టమని అంటారు. కానీ కొన్ని అరుదైన ఘటనలు విశేషాలుగా మారతుంటాయి. అలా 60 ఏళ్లు దాటిన తరువాత కూడా బిడ్డలకు జన్మనిచ్చిన కొన్ని అరుదైన ఘటనలు జరిగాయి. కానీ ఉగాండాలో ఓ మహిళ ఏకంగా 70 ఏళ్ల వయస్సులో కవల పిల్లలకు జన్మనిచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. తల్లికావాలనే తన కలను 70ఏళ్ల వయస్సులో నెరవేర్చుకున్నారు ఉగాండాలోని సఫీనా నముక్వాయా అనే మహిళ.
70 ఏళ్ల వయస్సులో సాధారణ పద్ధతిలో గర్భం దాల్చటం సాధ్యం కాదు. దీంతో ఆమె ఐవీఎఫ్ ప్రక్రియలో గర్భం దాల్చి పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఉగాండా రాజధాని కంపాలాలోని ఓ ఆస్పత్రిలో నఫీనా ఇద్దరు బుధవారం (నవంబర్ 29,2023) ఓ ఆడబిడ్డ, ఓ మగబిడ్డలకు జన్మనిచ్చారు. ఈ వయస్సులో ఇదో అద్భుతమని ఆమెకు ప్రసవం చేసిన డాక్టర్ ఎడ్వర్ట్ అన్నారు. సఫీనాకు సిజేరియన్ సర్జరీ ద్వారా ప్రసవం చేశామని తల్లీ, బిడ్డలకు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. దీంతో ఆమె సంతానోత్పత్తి పద్ధతుల ద్వారా తల్లయిన ఆమె ఆఫ్రికాలోనే అత్యంత పెద్దవయసులో తల్లైన మహిళగా రికార్డు సృష్టించారు.
సఫీనాకు 1992లో మొదటి భర్త చనిపోయాడు. ఆ తరువాత నాలుగేళ్లకు రెండో వివాహం చేసుకున్నారు. వారికి 20 ఏళ్లు దాటినా బిడ్డలు పుట్టలేదు. 2020లో ఇదే ప్రక్రియద్వారా ఓ పాప
జన్మనిచ్చారు సఫీనా.. కానీ ఆ పాప వారికి దక్కలేదు. దీంతో తల్లికావాలనే ఆమె కోరిక తీరనేలేదు. కానీ ఎట్టకేలకు ఆఖరి దశలో 70 ఏళ్ల వయస్సులో ఆమె మరోసారి ఐవీఎఫ్ ప్రక్రియద్వారా కవలలకు జన్మనివ్వటం వారు ఆరోగ్యంగా ఉండటంతో సఫీనా దంపతుల ఆనందం అంతా ఇంతా కాదు.