Justice Gautam Chaudhary : మాతృభాషలో 14వేలకు పైగా తీర్పులిచ్చి న్యాయమూర్తి ప్రపంచ రికార్డు
మాతృభాషలో 14వేలకుపైగా తీర్పులు ఇచ్చి ప్రపంచ రికార్డు సాధించారు జస్టిస్ గౌతమ్ చౌదరి. అలహాబాదు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ గౌతమ్ చౌదరి తన మాతృభాష అయిన హిందీలో 14,232 తీర్పులు ఇచ్చి ప్రపంచ రికార్డు సాధించారు.

allahabad HC Justice Gautam Chaudhary
allahabad HC Justice Gautam Chaudhary record : మాతృభాషలో 14వేలకుపైగా తీర్పులు ఇచ్చి ప్రపంచ రికార్డు సాధించారు జస్టిస్ గౌతమ్ చౌదరి. అలహాబాదు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ గౌతమ్ చౌదరి తన మాతృభాష అయిన హిందీలో 14,232 తీర్పులు ఇచ్చి ప్రపంచ రికార్డు సాధించారు. దీంతో న్యాయమూర్తులతో పాటు ఎంతోమంది న్యాయవాదులు ఆయనను అభినందిస్తున్నారు. ఇంగ్లీషు మీడియంలో చదివిన జస్టిస్ గౌతమ్ చౌదరికి తన మాతృభాష హిందీ పట్ల మక్కువ ఎక్కువ. హిందీ భాషతో భాషతో పాటు అన్ని భాషలను గౌరవిస్తానని కానీ హిందీ తన మాతృభాష కాబట్టి కాస్తంతా మమకారం ఎక్కువే ఉంటుందని నవ్వుతు చెబుతారు ఆయన.
గౌతమ్ చౌదరి 2019 డిసెంబర్ 12న అలహాబాద్ హౌకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఆయన హిందీ భాషలోనే తీర్పులిస్తున్నారు. దీంట్లో భాగంగానే గత అక్టోబర్ 8 వరకు ఆయనిచ్చి తీర్పులు 14వేలు దాటాయి. అంటే కేవలం నాలుగు సంవత్సరాల్లోపులోనే 14,232 తీర్పున్ని హిందీలో ఇచ్చారు. ఇది ప్రపంచ రికార్డు. రోజు ఆయన చేపట్టి విచారణల్లో 60శాతానికి పైగా తీర్పుల్ని హిందీలోనే వెలువరిస్తారు. దీంట్లో తీర్పులు, బెయిల్ పిటీషన్లు, రివిజన్ పిటీషనలు వంటివి ఉంటాయి. జస్టిస్ గౌతమ్ చౌదిరి ఇచ్చే హిందీ తీర్పులను స్ఫూర్తిగా తీసుకున్న ఇతర న్యాయమూర్తులు కూడా హిందీలోనే నిర్ణయాలు తీసుకోవటం తీర్పులు వెలువరించటం చేస్తున్నారు.
World Record : మూడు నెలల పసిబిడ్డ ప్రపంచ రికార్డ్ ..!!
ఈ సందర్భంగా జస్టిస్ గౌతమ్ చౌదరి మాట్లాడుతు..తనకు హిందీ భాషపై మమకారం పెరటానికి కారణ తన తండ్రి, భార్యేనని తెలిపారు. తాను కాన్వెంట్ లో చదివే సమయంలో తన తండ్రి హాఫ్ ఇయర్లీ పరీక్షలో మిందీ సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చాయని అది చూసి తన తండ్రి మందలించారని తెలిపారు. ఈ సందర్భంగా తన తండ్రి అన్న మాటల్ని గుర్తు చేసుకున్నారు. ‘ఇంగ్లీషు నేర్చుకో కానీ మాతృభాషను మర్చిపోవద్దు..తక్కువగా చూడొద్దు’ అని సూచించారని తెలిపారు.
జస్టిస్ గౌతమ్ చౌదరి హిందీలో ఇస్తున్న తీర్పులను సామాన్య ప్రజలు కూడా అభినందిస్తున్నారు. మాతృభాషలో తీర్పులు ఇవ్వటం వల్ల సాధారణ ప్రజలకు కూడా సమాచారం సులభంగా అర్థమవుతుందని అంటున్నారు.
Supreme Court : మహిళ గర్భ విచ్చిత్తిపై ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విభిన్న తీర్పులు