Strange Wedding : వరదలు ముంచెత్తినా తగ్గేదేలే .. వరుడు,వధువు లేకుండానే పెళ్లి ..

వరుడు లేడు వధువు లేదు..అయినా నిర్ణయించిన ముహూర్తానికే పెళ్లి జరిగిపోయింది. వర్షాలు, వరదలు ముంచెత్తిని అనుకున్న సుమూర్తానికే పెళ్లి జరిగిపోయింది.

Strange Wedding : వరదలు ముంచెత్తినా తగ్గేదేలే .. వరుడు,వధువు లేకుండానే పెళ్లి ..

Online Wedding Himachal pradesh

Updated On : July 13, 2023 / 3:34 PM IST

Online Wedding: ఉత్తరాది రాష్ట్రాలను వర్షాలు ముంచెతున్నాయి. వరదలతో అతలాకుతంగా మారిపోయాయి. ఈ వర్షాలు పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నవారి కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. వరదల్లో పెళ్లి ఎలా చేయాలా..? అని ఆందోళనతో ముహూర్తాలను వాయిదా వేసుకోలేక..వివాహం ఎలా జరిపించాలో అర్థం కాక అయోమయంలో పడిపోతున్నారు. కానీ టెక్నాలజీ పుణ్యమాని..గత కొంతకాలంగా వింత వింత వివాహాలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా కరోనా కాలంలో ఇటువంటి టెక్ వివాహాలు జోరుగా జరిగాయి.

ఈ వివాహాలకు వధువు(Bride), వరుడు ( Groom)లేకపోయినా బంధులు మిత్రులు లేకపోయినా వివాహాలు మాత్రం జరిగిపోయాయి. అటువంటి టెక్నాలజీతోనే ఈ వరదల్లో పెట్టుకున్న సుముహూర్తానికే వివాహం జరిగిపించారు హిమాచల్ ప్రదేశ్ లో. అదే ఆన్ లైన్ మ్యారేజ్..హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ జంట.. ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం ఇలా వివాహం జరుపుకున్నారు ఆన్ లైన్ లో…ఈ వర్షాలు మా పెళ్లిని ఆపలేవు అంటూ పెట్టుకున్న ముహూర్తాలకే పెళ్లి కానిచ్చేశారు.

హిమాచల్ ప్రదేశ్‌ (Himachal pradesh)సిమ్లా జిల్లా (Shimla District)లోని కోట్‌ఘర్ (Kotgarh )ప్రాంతానికి చెందిన ఆశిష్ సింఘా(Shish Singha)కు, కులు జిల్లా (Kullu district)భుంతార్ ప్రాంతానికి చెందిన శివానీ ఠాకూర్‌(Shivani Thakur)కు గతంలో వివాహం నిశ్చయించారు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈక్రమంలో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతుండటంతో పెళ్లి ఎలా జరిపించాలి? అని ఆందోళన పడ్డారు ఇరువైపుల పెద్దలు. భారీ వర్షాలకు రోడ్లు తెగిపోయాయి. వంతెనలు కూలిపోయాయి. వరదనీటిలో కొట్టుకుపోయాయి. జనజీవనం మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. కొన్ని చోట్ల కొండ చరియలు విరిగిపడి రాకపోకలు పూర్తిగా మూసుకుపోయాయి. దీంతో కులు ప్రాంతంలో పెళ్లి జరగాల్సి ఉండగా.. అక్కడికి వెళ్లడానికి వరుడి కుటుంబానికి రాకపోకలు లేకుండా పోయాయి.

వధూవరులు, వారి కుటుంబాలవారు నిశ్చయించిన ముహూర్తానికే వివాహం జరిపించి తీరాలనుకున్నారు.అతిథులు రాకపోయినా పర్లేదు..పెళ్లి మండపానికి చేరుకుంటే చాలు మూడు ముళ్లు వేయించేద్దామనుకున్నారు.కానీ అన్ని ప్రయత్నాలన్నీ వరుణుడు సాగనివ్వలేదు. ఇక ఆన్‌లైన్‌లో పెళ్లి చేసేద్దామని నిర్ణయించుకున్నారు. బంధువులు, అతిథులకు చెప్పారు.వీడియో కాన్ఫరెన్స్‌లో ఆశిష్, శివానీల వివాహం జరిపిస్తున్నామని చెప్పారు. ఆన్‌లైన్‌ లింకును అందరికీ పంపించారు. అనంతరం వారి పెళ్లిని ఆన్‌లైన్‌లోనే నిర్వహించారు. ఈ ఆన్‌లైన్‌ పెళ్లికి ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యే రాకేశ్ సింగ్‌ కూడా పాల్గొన్నారు. అలా వధువు వారింట్లోను..వరుడు వారి ఇంట్లోను ఉండగా ఆన్ లైన్ లో వివాహం జరిపించేసారు అనుకున్న ముహూర్తానికి..