France President Macron : బీరు బాటిల్ దించకుండా సెకన్లలో ఖాళీ చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు
క్రీడాకారులతో కలిసి బీరు తాగి ఎంజాయ్ చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు. ఎత్తిన బీరుబాటిల్ దించకుండా గటగటా తాగేశారు.

France President Macron drinks a beer
France President Macron drinks a beer : ఎత్తిన బీరు బాటిల్ దించకుండా తాగుతావా? పందెం అంటూ యువత పోటీలు పడి మరీ తాగేస్తుంటారు. కానీ ఓ దేశాధ్యక్షుడు ఎత్తిన బీరు బాటిల్ దించకుండా కేవలం సెకన్లలో బాటిల్ మొత్తం ఖాళీ చేసేశారు. ఆయన ఎవరో కాదు ఫ్రాన్స్ అధ్యక్షుడు (France President) ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron). ఆయన ఎత్తిన బీరు బాటిల్ దించకుండా కేవలం 17 సెకన్లలో ఖాళీ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఫ్రాన్స్ జాతీయ రగ్బీ (rugby team )చాంపియన్ నెగ్గటంతో మద్యం ఏరులైపారింది. ఈ సెలబ్రేషన్ లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ (Emmanuel Macron)స్వయంగా పాల్గొన్నారు. అంతేకాదు క్రీడాకారులతో కలిసి ఎంజాయ్ చేశారు. దీంట్లో భాగంగానే మెక్రాన్ ఓ బీరు బాటిల్ ఎత్తి గటగటా తాగేశారు. ఎత్తిన బాటిల్ దించకుండా కేవలం 17 సెకన్లలో ఖాళీ చేసేశారు. దీంతో అక్కడున్నవారంత ఉత్సాహంగా కేరింతలు కొట్టారు.
ఫ్రాన్స్ లోని రగ్బీ క్రీడకు ఎంతో ప్రాచుర్యం ఉంది. అక్కడ నిర్వహించే స్టేట్ డి నిర్వహించే స్టేట్ డి ఫ్రాన్స్ టోర్నీలో ఈసారి టౌలౌస్ రగ్బీ జట్టు (Toulouse- France’s local rugby team) విజయం సాధించింది. దీంతో గత శనివారం (జూన్ 18,202)సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల్లో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ కూడా పాల్గొని సందడి చేశారు. బీరుబాటిల్ ఎత్తి దించకుండా సెకన్లలోనే బాటిల్ మొత్తం ఖాళీ చేసేశారు. అదిచూసిన అక్కడున్నవారంతా ఇనుమడించిన ఉత్సాహంతో కేరింతలు కొట్టారు.
దేశాధ్యక్షుడు ఇలా పబ్లిగ్గా మందుకొట్టడంపై ఫ్రాన్స్ లో విమర్శలు వెల్లువెత్తాయి. మరి ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్ధులు విమర్శలు సంధించారు. మద్యం తాగమని స్వయంగా అధ్యక్షుడే ప్రోత్సహిస్తున్నారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన అధ్యక్షుడు… ఇలా బీరు కొట్టడం ద్వారా ప్రజలకు తప్పుడు సందేశాలు ఇస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. కాగా మాక్రాన్ బీరు బాటిల్ తాగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
?? FLASH | Emmanuel #Macron s'est envoyé une Corona cul-sec dans le vestiaire de Toulouse après sa victoire en Top 14.pic.twitter.com/zQKihXEIEH
— Cerfia (@CerfiaFR) June 18, 2023
PM Modi meets investors: న్యూయార్క్‌లో పెట్టుబడిదారులతో ప్రధాని మోదీ భేటి