Blue Whale : ఆ భారీ తిమింగలం పేలిపోతుంది దగ్గరకెళ్లొద్దని హెచ్చరిక

సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన అత్యంత భారీ తిమింగలం పేలిపోతుందని..దాని దగ్గరకు ఎవ్వరు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

Blue Whale : ఆ భారీ తిమింగలం పేలిపోతుంది దగ్గరకెళ్లొద్దని హెచ్చరిక

Blue Whale In Kerala beach

Blue Whale In Kerala beach : సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన అత్యంత భారీ తిమింగలం పేలిపోతుందని..దాని దగ్గరకు ఎవ్వరు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. కేరళలోని కోజికోడ్ బీచ్ లోకి ఓ భారీ తిమింగలం కొట్టుకొచ్చింది. ఈ విషయం తెలిసిన జనాలు దాన్ని చూసేందుకు భారీగా తరలి వస్తున్నారు. కానీ ఆ తిమింగలం పేలిపోతుందని ఎవ్వరు దాని దగ్గరకు వెళ్లవద్దు అంటూ అధికారులు హెచ్చరించారు. కానీ జనాలు ఎక్కడా ఆగటంలేదు..ఫోటోలు, వీడియోలు, సెల్ఫీలతో నానా రచ్చా చేస్తున్నారు.

కేరళలోని కోజికోడ్ బీచ్‌కు దాదాపు 50 అడుగులు పొడవైన చనిపోయిన బ్లూ వేల్ కొట్టుకొచ్చింది. శనివారం (సెప్టెంబర్ 30,2023) ఉదయం 10.15 గంటల సమయంలో స్థానికంగా ఉండే జాలర్లు దాన్ని గమనించారు. వెంటనే ఆరోగ్యాధికారులకు సమాచారం అందించారు. ఈ సమాచారంతో ఆరోగ్యా శాఖ అధికారి ప్రమోద్ వెంటనే బీచ్‌కు చేరుకుని తిమింగలం కళేబరాన్నిపరిశీలించారు. అది చనిపోయి రెండు రోజులు అవుతోందని గుర్తించారు. దాని మరణానికి కారణం తెలుసుకునేందుకు అక్కడే పోస్టుమార్టం నిర్వహిస్తామని..ప్రొటోకాల్ ప్రకారం దానిని అక్కడే పెద్దగొయ్యి పాతిపెడతామని చెప్పారు.

Indian whisky : భారతీయ ఇంద్రి విస్కీ వెరీ టేస్ట్ గురూ…ప్రపంచ నంబర్ వన్ అవార్డ్

తీరానికి కొట్టుకొచ్చిన బ్లూ వేల్ కళేబరానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో దానిని చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. నిజాముద్దీన్ అనే యూజర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ..తిమింగలం కళేబరం వద్దకు వెళ్లొద్దని, అది పేలిపోయి గాయాలపాలయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

పెద్ద తిమింగలాల కళేబరాల్లో వాయువులు ఏర్పడి ఒక్కోసారి పేలిపోతుంటాయి. అవి కొన్నిసార్లు నెమ్మదిగా విడుదలవుతాయి. మరికొన్ని సందర్భాల్లో మాత్రం భారీ పేలుడుతో బయటకు వచ్చేస్తాయి. గతంలో ఇలాంటి ఘటలు చాలానే జరిగాయి. అదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ఆ భారీ తిమింగలంపై మీరు కూడా ఓ లుక్కేయండి..