Guinness Record : పేక ముక్కలతో ప్యాలెస్ కట్టేసి గిన్నిస్ రికార్డు .. 15 ఏళ్ల కోల్‌కతా కుర్రాడి ఘనత

పేక మేడలు అని అని తేలిగ్గా తీసిపారేయొద్దు. పేకముక్కలతో మేడలు కట్టటం అంత ఈజీ కాదంటున్నాడు గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసిన కుర్రాడు. పేక ముక్కలతో ఏకంగా పాలెస్ కట్టేసి వావ్ అనిపించాడు.

Guinness Record : పేక ముక్కలతో ప్యాలెస్ కట్టేసి గిన్నిస్ రికార్డు .. 15 ఏళ్ల కోల్‌కతా కుర్రాడి ఘనత

Arnav Daga Guinness World Record

Updated On : October 7, 2023 / 3:00 PM IST

Arnav Daga Guinness World Record : పేకతో ఆడే ఆట ఓ వ్యసనం. కానీ పేక ముక్కలతో ఎన్నో విన్యాసాలు చేయొచ్చు.పేక ముక్కలతో మేడలు కట్టొచ్చు. దాన్ని పేక మేడలు అని అంటుంటాం. అలాగే పేక ముక్కలతో మెజిషియన్స్ ఎన్నో విన్యాసాలు చేస్తుంటారు. ఇలా పేకతో ఎన్నో కళాత్మక రూపాల్ని క్రియేట్ చేయొచ్చు. అది వారిలో ఉండే క్రియేటివిటీని బట్టి ఉంటుంది. అటువంటి కళతోనే ఓ కుర్రాడు పేకముక్కలతో ఏకంగా ప్యాలెస్ కట్టేశాడు. గిన్నిస్ రికార్డు కొట్టేశాడు. గతంలో ఉండే గిన్నిస్ రికార్డుని బద్దలు కొట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. పేక ముక్కలతో ఎవరైనా మేడలు కడతారు. కానీ 15 ఏళ్ల కుర్రాడు మాత్రం ఏకంగా పేకతో ప్యాలెస్సే కట్టేసి గిన్నిస్ రికార్డు కొట్టేశాడు..

కోల్ కతాకు చెందిన అర్నవ్ డాగా అనే 15 ఏళ్ల కుర్రాడు పేక ముక్కలతో అద్భుతమైన ప్యాలెస్ నిర్మించి గిన్నిస్ రికార్డు క్రియేట్ చేశాడు. ఏఖంగా 11 అడుగుల ఎత్తు 16అంగుళాల వెడల్పు కలిగిన ప్యాలెస్ నిర్మించాడు. ఆ ప్యాలెస్ పొడవు 40 అడుగులు కావటం మరో విశేషం. దాదాపుగా 41 గంటలకు పైగా కష్టపడి ఈ క్రియేటివిటీని పూర్తిచేశానని చెప్పాడు అర్నవ్. పేక ముక్కలతో ఎన్నో రకరకాల భవనాలను నిర్మించాడు. ప్రతీ నిర్మాణానికి రికార్టు కొట్టటం ఆర్నవ్ ప్రత్యేకత.

London : ఒకేరోజు ఆరుసార్లు ఆగి కొట్టుకున్న విద్యార్ధి గుండె, డాక్టర్ చదవాలనుకుని నిర్ణయించుకున్న బాధితుడు

అర్నావ్ బ్రయాన్ పేకముక్కలతో పొడవు 34 అడుగుల 1 అంగుళం, 9 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 11 అడుగుల 7 అంగుళాల వెడల్పుతో మూడు మకావూ హోటళ్ల ప్రతిరూపాలను సృష్టించి రికార్డులకెక్కాడు. తాజాగా అర్నవ్ పేకముక్కలతో నిర్మించిన అద్భుతమైన భవన నిర్మాణానికి గిన్నిస్ రికార్డు వరించింది. అర్నావ్ సాధించిన ఈ రికార్డుతో గతంలో బ్రయాన్ బెర్గ్ పేరుతో ఉన్న పేక మేడల రికార్డు చెరిగిపోయింది. సరికొత్త రికార్డు క్రియేట్ అయ్యింది.

అర్నవ్ డాగా 10th క్లాస్ చదువుతున్నాడు. పేకమేడ కట్టటం చాలా ఈజీ అనుకుంటాం కానీ చాలా కష్టమే అని చెప్పాడు. కానీ తనకు పేకతో నిర్మాణాల రూపాలు క్రియేట్ చేయటం ఇష్టమని ఆ ఇష్టమే తనకు గిన్నిస్ రికార్డు తెచ్చి పెట్టందంటాడు. చిన్నతనం నుంచి ఇలా పేక ముక్కలతో చిన్న చిన్న మేడలు కడుతూ ఉండేవాడి కరోనా లాక్ డౌన్ టైమ్ లో ఈ హాబీని సీరియస్ గా తీసుకున్నానని గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడనని తెలిపాడు. అలా పేకముక్కలతో నిర్మాణాలు రూపొందించి రికార్డులు క్రియేట్ చేస్తుంటం తనకు చాలా ఇష్టమని చెప్పాడు.

Most Expensive Lehenga : వజ్రాల లెహంగా, ధర వింటే దిమ్మ తిరిగిపోవాల్సిందే

ఈక్రమంలో గిన్నిస్ రికార్డు కోసం ప్రయత్నించానని దీంట్లో భాగంగా గతంలో పేకముక్కలతో ఉన్న రికార్డుల గురించి ఇంటర్ నెట్ లో అధ్యయనం చేసానని తెలిపాడు. అలాగే ఈ పేకముక్కలతో నిర్మాణం చేయటానికి మొదట్లో తాను చాలా తెలుసుకున్నానని అలా తన సాధనతో గిన్నిస్ రికార్డు సాధించానని తెలిపాడు. ఈ రికార్డు కోసం గత ఏడాది యత్నించి విఫలమయ్యానని కానీ నిరాశ చెందకుండా మరింత ఉత్సాహంతో సాధన చేసి తాను అనుకున్నది సాధించగలిగానని ఆర్నవ్ తెలిపాడు.