Monkey: పోలీసులంటే కోతులకూ భయమే.. సైరన్ విని మాస్క్ పెట్టేసుకుంది

కరోనా కారణంగా, ఫేస్ మాస్క్ తప్పనిసరి చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

Monkey: పోలీసులంటే కోతులకూ భయమే.. సైరన్ విని మాస్క్ పెట్టేసుకుంది

Watch Video

Updated On : January 5, 2022 / 2:52 PM IST

Monkey : కరోనా కారణంగా, ఫేస్ మాస్క్ తప్పనిసరి చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. మాస్క్ లేకుండా తిరగొద్దు అని చెబుతున్నా.. కొంతమంది మాత్రం మాస్క్ వేసుకోకుండానే తిరుగుతున్నారు.

కరోనా కారణంగా.. దేశంలో ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరి. చాలా మంది ఈ నిబంధనను పట్టించుకోకుండా మాస్క్ లేకుండా తిరుగుతున్నారు.

అయితే, పోలీసులు ఎదురుగా వస్తే మాత్రం వెంటనే మాస్క్ పెట్టుకోవడం చూస్తూనే ఉంటాం కదా? పోలీసుల చర్యల పట్ల ఈ భయం మనుషుల్లోనే కాదు, జంతువుల్లో కూడా కనిపిస్తుంది. ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు కానీ ఇది వాస్తవం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఈ విచిత్రం కనిపిస్తుంది. ఈ వీడియోలో ఓ కోతిలో పోలీసుల సైరన్ విని మొఖానికి మాస్క్ పెట్టేసుకుంది.

ఈ పూర్తి వీడియో చూస్తే.. సరదాగా కూడా అనిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో రోడ్డుపై తిరుగుతున్న కోతి.. ముందు ఎలాంటి మాస్క్ ధరించలేదు. చేతిలో మాస్క్ ఉన్నప్పటికీ. రోడ్డు మీద హాయిగా తిరుగుతూ మాస్క్ లేకుండా కనిపించింది. ఇంతలో అటు పోలీస్ సైరన్ మ్రోగుతూ వినిపించింది.

సైరన్ విని కోతి తీరు మార్చుకుని చేతిలో ఉన్న మాస్క్‌ని ముఖంపై పెట్టుకుంది. ముఖమంతా మాస్క్ కప్పుకుని కోతి స్టైల్‌గా కనిపించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో విపరీతంగా నవ్విస్తోంది. ఈ వైరల్ వీడియో కొన్ని సెకన్లు మాత్రమే ఉంది. కానీ, కొన్ని సెకన్ల వీడియోనే ఇప్పటివరకు దాదాపు 3లక్షల 69వేల మంది లైక్‌ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by ⓐⓛⓞⓚ ⓢⓗⓐⓡⓜⓐ (@alok_sharma_20_2)