Snake Less Countries : ప్రపంచంలో పాములు లేని దేశాలు .. దీని వెనుక ఆసక్తికర కారణాలు..!

పాముకాటుకు గురై ప్రతీ ఏటా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పల్లెలు, పట్నాలు, నగరాలు అనే తేడా లేకుండా ప్రతీ ప్రాంతంలోనే పాముల సంచారం ఉంటుంది. కానీ ఈ ప్రపంచంలో పాములు లేని దేశాలు ఉన్నాయని తెలుసా..? వినటానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా నిజమే. ప్రపంచంలో పలు ప్రాంతాల్లో ఒక్క పాము అంటే ఒక్క పాము కూడా లేని ప్రదేశాలు ఉన్నాయట.

Snake Less Countries : ప్రపంచంలో పాములు లేని దేశాలు .. దీని వెనుక ఆసక్తికర కారణాలు..!

Snake Less Countries In world

Snake Less Countries In world  : పాములు. వీటి పేరు చెబితేనే భయపడిపోతాం. అటువంటి పాముకాటుకు గురై ప్రతీ ఏటా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పల్లెలు, పట్నాలు, నగరాలు అనే తేడా లేకుండా ప్రతీ ప్రాంతంలోనే పాముల సంచారం ఉంటుంది. కానీ ఈ ప్రపంచంలో పాములు లేని దేశాలు ఉన్నాయని తెలుసా..? వినటానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా నిజమే. ప్రపంచంలో పలు ప్రాంతాల్లో ఒక్క పాము అంటే ఒక్క పాము కూడా లేని ప్రదేశాలు ఉన్నాయట. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో అస్సలు పాములు అనేవే ఉండని దేశాలున్నాయి. దీని వెనుక చాలా ఆసక్తికర కారణాలున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు నాలుగు వేలకు పైగా పాముల రకాలున్నాయి. వీటిలో విషపూరితమైనవి కొన్నే ఉన్నాయి. కానీ ఆ కొన్నింటివల్లే ప్రతీ ఏటా లక్షలమంది ప్రాణాలు కోల్పోతున్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. తాచుపాము,కింగ్ కోబ్రా, రక్తపించర వంటి కొన్ని రకాల విషపూరితమైన పాము కాటుకు గురైతే మనిషి ప్రాణాలు కోల్పోతాడు. కానీ అసలు పాములే లేని దేశాలు ఉన్నాయంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. మరి ఆ పాములు లేని దేశాలు ఏవి..ఎందుకు అక్కడ పాములు ఉండవు..? అనే విషయాలు తెలుసుకుందాం..

ఐర్లాండ్‌..
ఐర్లాండ్‌లో పాములు ఉండవు. ఐర్లాండ్ ఉత్తర అట్లాంటిక్ లోని ఒక ద్వీపం.ఎందుకంటే ఐర్లాండ్ దేశ చాలా చల్లని వాతావరణం కలిగిన దేశం. వాతావరణ పరంగా ఐర్లాండ్ లో వెచ్చదనం అనేదే ఉండదు. పాములకు వెచ్చదనం, వెలుతురు కలిగిన వాతావరణంలోనే జీవించగలవు. అందుకే ఐర్లాండ్ లో పాములు అనేవే కనిపించవట. కానీ పురాతన కాలంలో కొన్ని పాములు ఉండేవని అవి కూడా సాధారణమైన మూడు రకాల పాములు మాత్రమే ఉండేవని అవి తీవ్రమైన చలి వల్ల అంతరించిపోయాయి. అప్పటి నుండి అక్కడ ఉండే చలి వల్ల పాములు ఉండవట.

కాగా ఐర్లాండ్ లో పాములు జీవించకపోవటం వెనుక ఓ ఆసక్తికర కథ ఉంది. ఐర్లాండ్‌లోని క్రైస్తవ మతాన్ని రక్షించడానికి, సెయింట్ పాట్రిక్ దేశం నలుమూలల నుండి పాములను ద్వీపం నుండి తీసుకెళ్లి సముద్రంలో విసిరాడని అప్పటి నుంచి అక్కడ పాములు ఉండవని చెబుతారు. కాగా ఐర్లాండ్ లో ఇప్పటి వరకు పాములు ఉన్న దాఖలాలు లేవని ఫాసిల్ రికార్డ్స్ విభాగం చెబుతోంది.

అలాగే 100 మిలియన్ల ఏళ్ల క్రితం ప్రకృతి వైపరీత్యాల వల్ల ఐర్లాండ్ నీటిలో మునిగిపోయిందని..అందుకే ఇక్కడ పాములు కనిపించకుండా పోయాయని మరికొందరు చెబుతుంటారు. కానీ కారణం ఏమైనా పాములు లేని దేశంగా ఐర్లాండ్ మాత్రం ఉంది.

అంటార్కిటికా..
అంటార్కిటికా ఖండంలో కూడా పాములు ఉండవు. ఎందుకంటే ఇక్కడ అంతా మంచు. దీంతో అతి శీతల వాతావరణం జీవించలేని పాములు మంచు ఖండం అయినా అంటార్కిటికాలో కూడా పాములు జీవించలేవు. అందుకే ఇక్కడ పాముల మనుగడ ఉండదు. ఎన్నో అరుదైన వన్యప్రాణులకు అంటార్కిటికా అనువైనదిగా ఉంది. సీల్స్ , పెంగ్విన్లు , ఓర్కాస్ , స్క్విడ్లు,బ్లూ వేల్స్,ధృవపు ఎలుగు బంట్లు వంటి అరుదైన జీవులకు అంటార్కిటికా ఆవాసంగా ఉంది. కానీ ఈ మంచు ఖండంలో పాములు మాత్రం ఉండవట.

న్యూజిలాండ్..
ప్రపంచంలో పాములు లేని దేశం న్యూజిలాండ్ కూడా ఒకటి. న్యూజీలాండ్ అనేది పసిఫిక్ మహాసముద్రంలో నైరుతి మూలన ఉన్న ఒక ద్వీపం ఈ న్యూజిలాండ్. ఈ ద్వీప దేశం అనేక అడవి జంతువులకు నిలయం, కానీ ఆశ్చర్యకరంగా, ఇప్పటివరకు ఇక్కడ ఒక్క పాము కూడా కనుగొనబడలేదట. ఇక్కడ పాములు లేకపోవటానికి కారణం సముద్రాలను దాటి ఇక్కడికి పాములు చేరుకోలేకపోవటమేనంటారు.

కానీ పాములు న్యూజిలాండ్ చుట్టు నీటిలో కొన్ని రకాల పాములు కనిపిస్తాయని ‘ ఎల్లో లిప్డ్ సీ క్రైట్’ , ‘ఎల్లో-బెల్లీడ్ సీ స్నేక్’ వంటి పాములు న్యూజిలాండ్ చుట్టు ఉండే నీటిలో కనిపిస్తాయని కానీ నీరు చల్లదనానికి అవి వెంటనే తిరిగి వెళ్లిపోతాయని అందుకే ఆ దేశ భూభాగంలోకి వెళ్లలేవని అందుకే అక్కడ ఉండవని అంటారు. కాగా..న్యూజిలాండ్‌లో పాములపై ​​పూర్తి నిషేధం ఉంది. అంటే పాములను పెంపుడు జంతువులుగా ఉంచుకోకూడదు. అలాగే జూలో ఉంచకూడదు. దేశంలో పాములను అనుమతిస్తే అవి పాము రహిత పర్యావరణ వ్యవస్థలో అసమతుల్యతను కలిగిస్తాయని నమ్ముతారు.

గ్రీన్ లాండ్..
ఆర్కిటికాల వలెనే గ్రీన్‌ల్యాండ్‌లో పాములు లేవు. ఈ దేశంలోని వాతావరణం పాము జాతులకు సహజ నివాసంగా లేదు. గ్రీన్‌ల్యాండ్‌లో కూడా న్యూజిలాంట్ వలెనే పెంపుడు పాములపై నిషేధం ఉంది. ఒకవేళ పాములను పెంచుకోవాలనుకుంటే అక్కడ సంబంధిత అధికారుల అనుమతి తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.

ఐస్లాండ్..
పాములు నివసించలేని మరొక కూలెంట్ ఐలాండ్. ఐస్ లాండ్ పేరుకు తగినట్లుగా ఐస్ ఉండే ప్రాంతం. అదేనండీ మంచు ప్రాంతం. ఇక్కడ వాతావరణ పాములు నివాసానికి ఏమాత్రం అనువుగా ఉండదు.ఈ మంచు ప్రాంతంలో పాములు ఏమాత్రం జీవించలేవు.

ఐస్‌ల్యాండ్‌లో పాములు లేకపోయినా ఐస్‌లాండ్‌లో కనిపించే ‘ఇసుక పాములు’ గురించి గందరగోళనానికి గురవుతారు. “ఇసుక పాము” గాలి చాలా వేగంగా గాలిలో ఇసుకను వీచినప్పుడు అది పాము ఆకారాన్ని తీసుకుంటుంది. సాండ్ స్నేక్ అంటే పాము కాదు. గాలి ఒత్తిడికి ఏర్పడే ఒక రకమైన వింత అని చెప్పుకోవాలి. ఇదో గొప్ప అనుభూతిగా భావిస్తుంటారు పర్యాటకులు.

అలాస్కా..
అలాస్కా పాము రహిత జోన్‌గా నిర్ధారించబడింది. అలాస్కా చాలా చల్లని వాతావరణ కలిగిన ప్రాంతం. సూర్యకాంతి పడే ప్రాంతం చాలా తక్కువ. సంవత్సరంలో తక్కువ ప్రాంతాల్లో మాత్రమే సూర్యకాంతి పడుతుంది. ఈ వాతవరణం ఇక్కడ అక్కడ ఏ జాతి పాములు జీవించినట్లుగా దాఖలాలు లేవని అంటారు. పాముల అవశేషాల రికార్డుల్లో మాత్రమే ఉన్నాయట. అలాస్కాలో అత్యంత తరచుగా కనిపించే సాధారణ గార్టెర్ పాము మాత్రమేనట. అలాస్కాలో దాదాపు పాములు లేవు. ఇక్కడ ఉన్న ఉన్న ఏకైక సరీసృపం సముద్ర తాబేలు మాత్రమే.

అలాగే హవాయి.కుక్ ఐలాండ్, కేప్ వెర్డే, పసిఫిక్ దీవులు,ఉత్తర రష్యా, కెనడాలో కూడా పాములు లేవని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం అక్కడి వాతావరణ పరిస్థితులే కారణమని తెలుస్తోంది.