The Bank Tavern : ఈ రెస్టారెంట్‌లో లంచ్ చేయాలంటే నాలుగేళ్లు వెయిట్ చేయాల్సిందే .. మరి అంత స్పెషల్ ఏంటో తెలుసా..?

ఫుడ్ ప్రియులను కూడా ఓపికగా వెయిట్ చేయించే రెస్టారెంట్ అది. అక్కడ తినటానికి టేబుల్ బుక్ చేేసుకుంటే నాలుగేళ్లకు మీ టైమ్ వస్తుంది. అంటే ఇక్కడ భోజనం చేయాలంటే ఉండాల్సింది ఆకలి కాదు ఓపిక..ప్రపంచంలోనే వెయిటింగ్ లిస్ట్ రెస్టారెంట్ అది.

The Bank Tavern : ఈ రెస్టారెంట్‌లో లంచ్ చేయాలంటే నాలుగేళ్లు వెయిట్ చేయాల్సిందే .. మరి అంత స్పెషల్ ఏంటో తెలుసా..?

The Bank Tavern Sunday roasts

The Bank Tavern In UK : ఫలానా రెస్టారెంట్ లో ఫుడ్ చాలా బాగుందట..అని తెలిస్తే చాలు తీరిక చేసుకుని మరీ వెళ్లతారు భోజనప్రియులు. ఈరోజుల్లో బయటఫుడ్స్ కు ఎంత డిమాండ్ ఉండో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. వీకెండ్ వస్తే చాలు ఇంట్లో వంట పనేలేదు.ఛలో అవుట్ సైడ్ ఫుడ్ అనేలా ఎక్కోడోకచోటికి వెళ్లి తినేయటమే. ఈక్రమంలో ఆ వెళ్లేదేదో రుచికరమైన ఫుడ్ దొరికే ప్లేస్ ఏదో తెలుసుకుని దూరమైనాసరే అక్కడికి వెళ్లి తిని వస్తుంటారు. అది రెస్టారెంట్ అయినా రోడ్ సైడ్ ఫుడ్ అయినా సరే..ఫుడ్స్ కోసం ల్యాండ్ మార్క్ కూడా ఫేమస్ అయ్యాయంటే మరి ఇంటి భోజనం కంటే బయటి భోజనానికి డిమాండ్ ఎంత పెరిగిందో అర్థమైపోతుంది. అడవిలో ఫుడ్ సెంటర్ పెట్టినా అక్కడ బాగుంది అంటే అక్కడికి వెళ్లాల్సిందే..తినాల్సిందే అనేలా ఉంది.

అటువంటిది ఓ మాంచి ఫేమస్ రెస్టారెంట్ గురించి చెప్పుకోవటానికే ఈ ఉపోగ్ఘాతమంతాను..ఇంతకీ ఏమా రెస్టారెంట్ ఎక్కుడుందో చెప్పండి ఓ ట్రిప్పేసి ఓ పట్టుపట్టేద్దామనుకుంటున్నారా..ఆహా ఈ రెస్టారెంట్ అలాంటిలాంటిది కాదు..ఈ రెస్టారెంట్ లో భోజనం తినటానికి టేబుల్ బుక్ చేసుకుంటే ‘నాలుగు సంవత్సరాలు’ వెయిట్ చేయాల్సిందే..!! ఏంటీ షాక్ అయ్యారా…? అయ్యే ఉంటార్లెండి..మరి ఇంత లేటా..మరి ఏంటి అంత స్పెషల్ ఆ రెస్టారెంట్ లో అనే ఉత్సుకత పెరిగే ఉంటుంది కదూ..

Bengaluru Woman: ‘మరీ తెల్లగా ఉన్నారు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేం’ కంపెనీ సమాధానానికి షాక్ అయిన యువతి

అది ద గ్రేట్ బ్రిటన్ (UK). బ్రిస్టల్‌ ( Bristol)లో ఉంది ఆ ఫేమస్ రెస్టారెంట్. దాని పేరు ‘ది బ్యాంక్‌ టావెర్న్‌’(The Bank Tavern ). ఇది ప్రపంచంలోనే రిజర్వేషన్ చేసుకున్న నాలుగేళ్లకు ఫుడ్ లభించే రెస్టారెంట్ గా పేరొందింది. చిన్న పబ్‌లో ఉండే ఈ ఆదివారం ఇక్కడ భోజనం చేయటం అంత ఈజీ కాదు ఇక్కడ. ఎందుకంటే.. ఈ పబ్‌లో ప్రత్యేకంగా సిద్ధం చేసే ‘సండే రోస్ట్‌లు’ (Sunday roasts) కోసం నాలుగేళ్ల వేచి ఉండాల్సిందే. కాజిల్ పార్క్ సమీపంలోని జాన్ స్ట్రీట్లోని బ్యాంక్ టావెన్న్ సండే భోజనాలకు ఎంతో పేరొందింది. ఇక్కడ టేబుల్ బుక్ చేసుకుంటే నాలుగేళ్లకు మన వంతు అంటే భోజనం చేసే అవకాశం వస్తుంది. అంటే దీనికి ఇక్కడి సండే రోస్ట్ (Sunday roasts) లకు ఎంత డిమాండ్ ఉండో అర్థం చేసుకోవచ్చు.

డోజీలోని రెస్టారెంట్‌ బుకింగ్‌ మేనేజ్‌మెంట్‌ నిపుణులు యూకేలోనే సుదీర్ఘ వెయిటింగ్‌ లిస్టు ఉన్న పబ్‌గా దీన్ని గుర్తించారు. కొవిడ్‌ సమయంలో దేశవ్యాప్తంగానే కాదు ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఫుడ్ సెంటర్లు మూతపడ్డాయి. ఆఖరికి ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా వెలవెలబోయాయి. అలా యూకేలో చాలా చాలా పబ్‌లు, రెస్టారెంట్లను మూసివేశారు. ఫలితంగా ఈ పబ్‌లో ‘సండే రోస్ట్‌ల’ కోసం జరిగిన ముందస్తు బుకింగ్స్‌ అంటే రిజర్వేషన్ వెయిటింగ్‌ లిస్ట్‌ ఇంకా పెరిగింది. దీంతో ఇక్కడ భోజనం చేయటానికి రిజర్వ్ చేసుకున్నవారి లిస్ట్ అత్యంత భారీగా పెరిగి ఇక్కడి ఫుడ్ ఆస్వాదించాలంటే నాలుగేళ్లు వేచి చూడాల్సిందే. మరి తమ వంతు వచ్చాక ఫుడ్ తిన్నవారు ఏదో సాధించినట్లుగా ఫీలైపోతుంటారు.

Zebra line On Road : వర్షాకాలంలో జీబ్రా లైన్ దాటేటప్పుడు బీ కేర్ ఫుల్ .. తెలుపురంగుపై ‘అడుగు’ జాగ్రత్త ఎందుకంటే..

మరి ఈ పబ్ లోని రెస్టారెంట్ లో ‘సండే రోస్ట్‌ల’కు అంత స్పెషల్ ఏంటీ అంటారా.. ఈ పబ్‌ ఈనాటిది కాదు 19వ శతాబ్దం నాటిది. ఇక్కడి రోస్టుల్లో బీఫ్‌, పోర్క్‌ బెల్లీ, ల్యాంబ్‌, దినుసులతో కలిపిన ప్రత్యేకమైన వంటకాలను వడ్డిస్తారు. వీటి కోసం చాలా మంది ముందుగా బుక్‌ చేసుకుంటారు. 2018లో బ్రిస్టల్‌ గుడ్‌ ఫుడ్‌ అవార్డ్స్‌లో ఉత్తమ సండే లంచ్‌గా ఎంపికైంది. 2019లో అబ్జర్వర్‌ ఫుడ్‌ మంత్లీ అవార్డును గెలుచుకుంది. ఇలా ఎన్నో అవార్డులను సొంతం చేసుకొంది.

కాగా ఈ బ్యాంక్ టావెర్న్ టేబుల్ కోసం వేచి ఉన్న వారి లిస్టు పెరిగిపోవటంతో మార్చి 2022లో రిజర్వేషన్‌లను తీసుకోవడం ఆపివేసింది. అబ్జర్వర్ ఫుడ్ మంత్లీ అవార్డ్స్‌లో UKలో అత్యుత్తమంగా ఎంపికైన తర్వాత..ఏప్రిల్ 2023 వరకు ప్రతి వారాంతంలో ఆదివారం లంచ్ కోసం ఇప్పటికే బుక్ చేసుకున్నట్లు పబ్ వెల్లడించింది. మరి ముఖ్యంగా దీనికున్న మరో ప్రత్యేకత ఏంటంటే..ఈ బ్యాంక్ టావెర్న్‌లో ఏడు టేబుల్స్ మాత్రమే ఉన్నాయి. వీటిని ఆదివారం కేవలం గంటన్నర పాటు మాత్రమే బుక్ చేసుకునే వీలుంది.

రిజర్వేషన్ పొందడానికి ప్రపంచంలోని కష్టతరమైన రెస్టారెంట్లు లిస్ట్..

1) బ్యాంక్ టావెర్న్, బ్రిస్టల్, UK (The Bank Tavern, Bristol, UK) – 4 సంవత్సరాలు

2) డామన్ బేహ్రెల్, న్యూయార్క్, USA (Damon Baehrel, New York, USA)- 1 సంవత్సరం

3) మసాలావాలా,సన్స్, న్యూయార్క్, USA (Masalawala & Sons, New York, USA)- 6 నెలలు

4) లా మెసిటా డి అల్మాంజా, టియెర్రా డెల్ ఫ్యూగో అర్జెంటీనా (La Mesita de Almanza, Tierra del Fuego Argentina)- 6 నెలలు

5) టేబుల్ 1, పుంటా డి మిటా, మెక్సికో ( Mesa 1, Punta de Mita, Mexico) – 6 నెలలు

6) డిస్ఫ్రూటర్, బార్సిలోనా, స్పెయిన్(Disfrutar, Barcelona, Spain) – 5 నెలలు

7) ది ఫ్యాట్ డక్, బ్రే, UK (The Fat Duck, Bray, UK )- 4 నెలలు

8) నోమా, కోపెన్‌హాగన్, డెన్మార్క్(Noma, Copenhagen, Denmark) – 3 నెలలు

9) ది కోవ్ క్లబ్, లండన్, UK(The Cove Club, London, UK) – 3 నెలలు

10) బ్రే, బిర్రెగుర్ర, ఆస్ట్రేలియా (Brae, Birregurra, Australia)- 2 నెలలు