World first Prison : 800 మంది కరడుకట్టిన ఖైదీల వల్ల మూతపడిన ప్రపంచంలోనే మొట్టమొదటి జైలు

అది ప్రపంచంలోనే మొట్టమొదటి జైలు. ఆ జైలులోప్రపంచంలోనే అత్యంత కరడు కట్టిన నేరస్థులు ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ జైలు దెయ్యాలు ఉన్నాయని అంటుంటారు.

World first Prison : 800 మంది కరడుకట్టిన ఖైదీల వల్ల మూతపడిన ప్రపంచంలోనే మొట్టమొదటి జైలు

world's first prison

Updated On : October 5, 2023 / 6:01 PM IST

world first prison In America Pennsylvania : అది ప్రపంచంలోనే మొట్టమొదటి జైలు. ఆ జైలులో కరడు కట్టిన నేరస్థులు ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ జైలు దెయ్యాలకు నిలయంగా మారిందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. 200 ఏళ్ల నాటి ఆ జైలులోంచి ఏవేవో శబ్దాలు వస్తుంటాయని స్థానికులు అంటుంటారు. 200 ఏళ్లనాటి ఈ జైలు 800లమంది ఖైదీల వల్ల మూత పడింది. ఈస్టర్న్ స్టేట్ పెనిటెన్షియరీ ప్రపంచంలోనే మొదటి జైలుగా పరిగణిస్తారు.  జైళ్ల నిర్మాణానికి ఈ జైలు ఓ నమూనాగా నిలిచిన ఈ జైలు కరడు కట్టిన నేరస్తుల్ని ఉంచటానికి నిర్మించారు. అటువంటి జైలు మూత పడటానికి 800లమంది ఖైదీలు కారణంగా చరిత్రలో నిలిచిపోయింది.

డైలీ స్టార్ నివేదిక ప్రకారం..అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలడెల్ఫియా నగరంలో నిర్మించబడిన ఈ జైలు మొదట్లో 250మంది ఖైదీలు ఉంచటానికి నిర్మించారు. అది కూడా కరడు కట్టిన ఖైదీలను ఉంచేందుకు 1829లో నిర్మించిన ఈ జైలులో 1971 వరకు కార్యకలాపాలు నిర్వహించారు.అలా రాను రాను ఈ జైలులో ఖైదీల సంఖ్య పెరుగుతు వచ్చింది. 50 ఏళ్లలో ఖైదీల సంఖ్య 1000 దాటింది. దీంతో పరిమితికి మించి ఖైదీల్ని ఉంచటం..వాతావరణంలో చోటుచేసుకునే మార్పులతో అంటు వ్యాధులు ప్రబలాయి.

1900లలో ఈ జైలులో టీబీ వంటి ప్రాణాంతక వ్యాధితో చాలా మంది ఖైదీలు చనిపోయారు. దీంతో ఈ జైలు ఖైదీల పాలిట ‘హెల్ ఆన్ ఎర్త్ ’గా పిలువబడేది. ఈ జైలులో ప్రపంచంలోనే అంత్యంత భయంకరమైన కరడు కట్టిన ఖైదీలను ఉంచేవారు. వీరిలో చికాగో గ్యాంగ్‌స్టర్ అల్ కాపోన్ కూడా ఈ జైలులోనే ఉండేవాడట. పేరుమోసిన ఖైదీలతో పాటు అత్యంత దారుణమైన పరిస్థితులను ఈ జైలు చవి చూసింది. ఎంత కరుడు కట్టిన ఖైదీలు అయినా తమ కళ్లముందే రోగాలతో బాధపడుతు తోటి ఖైదీలు చనిపోతుంటే భయపడిపోయేవారు. తాము కూడా వారిలాగనే రోగాలతో బాధపడుతు చనిపోతామనే భయాందోళనలు కలిగేవి వారికి. ఓపక్క టీవీ వంటి రోగాలతో బాధపడేవారు..మరో పక్క తమకళ్లముందే రోగాలతో చనిపోయేవారిని చూసిన వారు నరకం అంటే ఎక్కడో లేదు ఈ జైలే ప్రత్యక్ష నరకం అని భావించేవారు.

చలికాలంలో ఈ జైలులో ఉష్ణోగ్రతలు మైనస్‌కు పడిపోవడంతో చలికి ఖైదీలు వణికిపోయేవారు. ఖైదీల సంఖ్య పెరుగుతుండటే జైలు అధికారులను మరికొన్ని సెల్‌లను నిర్మించవలసి వచ్చింది. వీటిలో కొన్ని భూగర్భంలో నిర్మించారు. జైలులో 1961లో జరిగిన ఒక సంఘటన సంచలనం రేకెత్తించింది. జైలులోని 800 మందికి పైగా ఖైదీలు జైలు గార్డులు తమను హింసించారని ఆరోపిస్తూ వారిపై దాడి చేశారు.

పలు కీలక పరిణామాల మధ్య  ఈ జైలు 1971లో మూసివేశారు. ఆ తరువాత దాదాపు రెండున్నర దశాబ్దాల తరువాత అంటే 1994లో హిస్టరీ టూరిజం కోసం జైలు తిరిగి తెరిచారు. ఇప్పుడు ఈ జైలు పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. నేటికీ ఈ జైలు నుంచి వింత శబ్దాలు వస్తుంటాయని స్థానికులు చెబుతుంటారు.