అమరావతిలో వాజ్‌పేయీ 13 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ.. ఫొటోలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇవాళ మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయీ 13 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. అటల్ బిహారీ వాజ్‌పేయీ 101వ జయంతి సందర్భంగా, అమరావతిలోని వెంకటపాలెంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో పాల్గొనడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని చంద్రబాబు అన్నారు.








