ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ సహా కీలక నేతలను అడ్డుకున్న పోలీసులు.. ఫొటోలు
విపక్ష ఎంపీలు ఢిల్లీలో ఇవాళ ‘పార్లమెంట్ టు ఈసీ’ ర్యాలీ నిర్వహించారు. బిహార్లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకించారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు విపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.





















